టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన మాస్ మహారాజ రవితేజ ఇటీవల కాలంలో వరుసగా అపజయం పాలవుతున్న సంగతి  తెలిసిందే.  పవర్ మూవీ సూపర్ హిట్  తర్వాత బెంగాల్ టైగర్ , కిక్ 2 అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.   ఆ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వం లో రాజా ది గ్రేట్ మూవీ లో నటించాడు.   ఈ మూవీలో అంధుడిగా నటించిన  రవితేజ మంచి విజయాన్ని అందుకున్నాడు.  మళ్ళీ మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి.  రవితేజ ఈ సారి మూవీస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  

 

ఈ నేపథ్యంలో విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ మూవీ నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పిరియాడికల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖరున రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నెక్స్ట్ సినిమా ప్రారంభించాడు రవితేజ.  గతంలో తనతో డాన్ శీను , బలుపు సినిమాలు తెరకెక్కించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాకు ఆ టైటిల్ క్రాక్ ఫిక్స్ చేశారు . ఈ మూవీ షర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

 

ఈ సినిమాలో రవితేజ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుందని ఇటీవల దర్శకుడు పేర్కొన్నారు.  ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న రవితేజ తన లుక్ పరంగా డిఫరెంట్ గా కనిపించబోతున్నారట. ఇందు కోసం జిమ్ లో బాగా వర్క్ ఔట్ చేస్తున్నట్లు సమాచారం.   తాజాగా రవితేజ 12.5 కేజీల డంబిల్ తో వర్క్ ఔట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: