స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథనాయకుడిగా పూజా హెగ్డే కథానాయకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములులో. అలాంటి సూపర్ కాంబినేషన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని అంటున్నారు సినీ ప్రేక్షకులు.   

 

సినిమా ట్రైలర్, టీజర్ చూసి ఇది కూడా అన్ని సినిమాలు కలిసి కాపీ పేస్ట్ అయ్యి ఉంటుందిలే.. త్రివిక్రమ్ అంటేనే కాపీ కదా అని అనుకున్నారు. అయితే అది అంత నిజం కాదు అని.. సొంత స్క్రిప్టులు అని.. అది కూడా అద్భుత స్క్రిప్టులు అని ఫిక్స్ చేసేలా సినిమా తీశారు త్రివిక్రమ్.     

 

సినిమాలో అన్ని రకాల ఎమోషన్లు అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ.. కోపం.. కామెడీ.. పాటలు.. ఫైట్లు.. ఫ్యామిలీ జోకులు.. యాక్షన్ సీన్లు కూడా అరుపులు అరుపులు పుట్టుయించాయి. యాక్షన్ సీన్లు చూస్తే అబ్బా బలే ఉన్నాయే అని అనిపించేలా తీశారు.. అంత అద్భుతంగా ఉన్నాయి సీన్లు.. అసలు కాదేంటో చుడండి..    

 

అల్లు అర్జున్‌ తనదైన శైలి కామెడీ టైమింగ్‌, మేనరిజమ్స్‌తో సినిమాను మొత్తం తన భుజస్కందాలపై నడిపించాడు. పెరిగిన జుట్టు వల్ల బన్నీ ఈ సినిమాలో మరింత స్టైలీష్‌గా, హ్యాండ్స‌మ్‌గా కనిపించారు. ప్రతి సన్నివేశాన్ని తనదైన ఈజ్‌తో రక్తికట్టించాడు. నటనాపరంగా ఆయన్ని మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా అభివర్ణించవొచ్చు.     

 

యాక్ష‌న్ సీన్లు స్టైలీష్‌గా ఉన్నాయి. రామ్ - ల‌క్ష్మ‌ణ్ కంపోజ్ చేసిన ఈ సీన్లు మాస్‌ను మెప్పిస్తాయి. క్లైమాక్స్ ఫైట్‌ను జాన‌పాద పాట‌కు అనుగుణంగా కంపోజ్ చేయ‌డం అందులో బ‌న్నీ న‌టించిన విధానం బాగున్నాయి.. ఇలా అన్నిరకాల సీన్లను అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల నుండి కేకలు పెట్టించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: