కోలీవుడ్ లో సూపర్ స్టార్ విజయ్... టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లో ఇలయదళపతి విజయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంత రేంజ్ ఉన్న హీరో. పవన్ ని మించి సక్సెస్ రేటు ఉన్న స్టార్ హీరో. టాలీవుడ్ లో మహేష్ ...కోలీవుడ్ లో విజయ్ ఆ రేంజ్ హీరోలు. సినిమాల పరంగా ఈ స్టార్ హీరోల ఇద్దరిపైనా వంద కోట్లుకు పైగానే బిజినెస్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఆ ఇద్దరూ పక్క రాష్ట్రాల మార్కెట్లలోకి దూసుకెళ్లాలన్న తపనతో ఉన్నారు. ఇక కోలీవుడ్ మార్కెట్ పై పట్టు సాధించాలని మహేష్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. స్పైడర్ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని మురుగదాస్ తో కలిసి ప్లాన్ చేసినప్పటికి అనూహ్యంగా అంచనాలను అందుకోలేకపోయాడు. మహేష్ విషయంలో మురుగదాస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కొన్ని పొరపాటుల వల్ల మహేష్ కి కోలీవుడ్ లో సక్సస్ సాధ్యపడలేదు.

 

ఏ రోజైనా కోలీవుడ్ లో మహేష్ గట్టి సక్సస్ కొట్టే అవకాశం లేకపోలేదు. ఇక విజయ్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ మార్కెట్ పైనా పట్టు సాధిస్తున్నాడు. తెలుగు ఆడియెన్ ని కంటెంట్ తో ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. మెర్సల్- సర్కార్- బిగిల్ ఆ విధంగా చేసిన ప్రయత్నాలే. సూర్య- కార్తీలా వెంటనే కుదరకపోయినా తెలుగు ఆడియన్స్ కు నెమ్మదిగా కనెక్ట్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్- విజయ్ మల్టీస్టారర్ కి సన్నాహాలు చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన అభిమానుల్లో ట్రెండింగ్ అవుతోంది. 

 

ఇక మహేష్ ని విజయ్ తో కలిసి మల్టీస్టారర్ చేయడానికి మీరు సిద్దంగా ఉన్నారా? అని కోలీవుడ్ మీడియా ఇంటర్వూలో ప్రశ్నించగా నేను సిద్ధమేనని అన్నారు. ఇద్దరి ఇమేజ్ లకు తగ్గ స్క్రిప్ట్.. సరైన దర్శకుడు కుదిరినప్పుడు రెండు భాషల్లో సినిమా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇక మహేష్ నటించిన ఒక్కడు- పోకిరి గతంలో విజయ్ తమిళ్ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్లు కొట్టిన సంగతి తెలిసిందే.  ఒకవేళ నిజంగా ఈ కాంబినేషన్ వర్కౌట్ అయి మహేష్ బాబు-విజయ్ కలిసి గనక సినిమా చేస్తే అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ సృష్ఠించడం ఖాయం అంటున్నారు అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: