ఏదైనా ఒక సినిమా చర్చల దశలో ఉండగానే వంద రకాలు రూమర్లు స్ప్రెడ్ అవుతుంటాయన్న విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. అదీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రకమైన ప్రచారం మరీ ఎక్కువైపోయింది. చిన్న పాయింట్ లీకైనా అటు కామన్ ఆడియన్స్ ఇటు నెటిజన్స్ ఆగడం లేదు. ఫలానా సినిమాకి రీమేక్ చేయాలనుకుంటున్నారని లేదా లైన్ తీసుకుని వేరేగా తీస్తున్నారని ఇలా రకరకాలుగా ప్రచారం చేసేస్తున్నారు. అదీ త్రివిక్రమ్ సినిమాల విషయంలో ఆ తరహా ప్రచారం మరీ విపరీతంగా ఉంటుంది ఎందుకనో. త్రివిక్రమ్ ప్రతి సినిమాకి ఏదో ఒక కామెంట్ తప్పనిసరి అయిపోయింది. ఇది ఆయన డైరెక్షన్ మొదలు పెట్టినప్పటినుంచి కంటిన్యూ అవుతూనే ఉంది.

 

తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డే తో తెరకెక్కించిన 'అల వైకుంఠపురములో' సినిమా కూడా బాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీస్తున్నారని ఇంతకుముందు ఓ రూమర్ టాలీవుడ్ లో కొన్నాళ్ళు బాగా వినిపించింది. బాలీవుడ్ లో వంద కోట్ల వసూళ్లు సాధించిన 'సోను కీ టిటు కీ స్వీటీ' సినిమా ని రీమేక్ చేస్తున్నారని ప్రచారం పీక్స్ లో కి వెళ్ళిన సంగతి  తెలిసిందే. బన్ని రకరకాల డైలమాల్లో ఉన్న ఆ సమయంలో ఒరిజినల్ స్క్రిప్టు కంటే రీమేక్ స్క్రిప్టు బెటర్ అని భావిస్తున్నారని అందుకే బాలీవుడ్ రీమేక్ ని ప్లాన్ చేశారని ఫిలిం సర్కిల్స్ లో వాడి వేడి చర్చ సాగింది. తర్వాత ఆ చర్చ రొటీన్ అయిపోవడంతో జనాలు మర్చిపోయారు. తాజాగా ఈ రూమర్ పై బన్నీ ఓ ఇంటర్వూలో క్లారిటి ఇచ్చాడు. 

 

బాలీవుడ్ సినిమా 'సోను కీ టిటు కీ స్వీటీ' ను గీతా ఆర్స్ట్ లో రీమేక్ చేద్దామని అడిగారు. చాలా మంది అది నా కోసమే అనుకున్నారు కూడా. నేను కూడా ఆ సినిమా గురించి ఆలోచించాను. అయితే అదే సమయంలో త్రివిక్రమ్ నేను 'సోను కి టిటు' గురించి అనుకున్నాం. అలాగే మరో స్టారీ కూడా చర్చలోకి వచ్చింది. రీమేక్ స్టోరి కంటే ఇద్దరం డిస్కస్ చేసుకున్న అల స్క్రిప్ట్ అయితేనే సేఫ్ గా ఉంటుందని అనిపించింది. అందుకే  'సోను కే టిటు కీ స్వీటీ' జోలికి వెళ్లలేదు. ఆ సినిమా రిస్క్ అనిపించింది. అల వైకుంఠపురములో కాన్సెప్టులో కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది..సేఫ్ ప్రాజెక్ట్ లా అనిపించింది అని బన్ని అల వెనక దాగి ఉన్న సీక్రెట్ ని రివీల్ చేశాడు. మొత్తానికి రీమేక్ ఆలోచన బన్నిని బయపెట్టిందనే దీనిని బట్టి అర్థమవుతోంది. అంతేకాదు అల వైకుంఠపురములో ఏమాత్రం 'సోను కే టిటు కీ స్వీటీ' కాదని తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: