సంక్రాంతి సీజన్ కావడంతో తెలుగు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్ రజిని నటించిన దర్బార్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకివ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ఫుల్ గా ముందుకు నడుస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతి సీజన్ లో రాబోతున్న ఆఖరి సినిమా ఎంత మంచివాడవురా. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం వంటి కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 

మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ బాబు, సుహాసిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా కూడా ఆశించిన రేంజ్ లో హిట్ సాదిస్తుందని యూనిట్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు మహేష్, బన్నీ ల సినిమాలు బాగానే నడుస్తున్నప్పటికీ, అందరూ ఆశించిన రేంజ్ లో మాత్రం ఆ సినిమాలు తెరకెక్కలేదనే చెప్పాలి. 

 

అయితే రెండు రోజుల్లో రిలీజ్ కానున్న ఎంత మంచివాడవురా సినిమా ఏ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నా, వారిద్దరి సినిమాలను కొంత వెనక్కు నెట్టి దానిని అడ్వాంటేజ్ గా చేసుకుని దూసుకెళ్లడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కళ్యాణ్ రామ్ కు కెరీర్ పరంగా ఇటీవల సరైన సక్సెస్ లేకపోవడంతో, ఆయన ఈ సినిమా కోసం ఎంతో కసిగా పని చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్ని వర్గాలను ఆకట్టుకుని ఈ సినిమా మంచి టాక్ ని కనుక సంపాదిస్తే కలెక్షన్స్ బాగా సంపాదించవచ్చు. మరి ఈ సినిమా ఎంత రేంజ్ హిట్ అందుకుని ముందుకు సాగుతుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: