అత్యంత భారీఅంచనాలతో మొన్నవిడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ మొదటిరోజున 32.77 కోట్లు వసూలు చేసి మహేష్ కెరియర్ లోనే హైఎస్ట్ కలక్షన్స్ ఇచ్చిన మూవీగా నిలిచింది. ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఈసంక్రాంతి పండుగరోజులు గడిచేవరకు ఈమూవీ కలక్షన్స్ పరిస్థితి బాగానే ఉంటుంది కానీ సంక్రాంతి పండుగ తరువాత ఈమూవీ కలక్షన్స్ భారీగా పతనం అయ్యే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

నిన్న విడుదలైన ‘అల వైకుంఠపురములో మూవీకి విమర్శకుల ప్రశంసలతో పాటు సగటు ప్రేక్షకుడి ఆదరణ కూడ లభించడంతో మహేష్ బన్నీల మధ్య జరిగిన వార్ లో ఇంచుమించు అల్లు అర్జున్ గట్టెక్కినట్లే అన్నవార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పండుగ తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ కలక్షన్స్ ‘అల వైకుంఠపురములో’ ఎఫెక్ట్ తో బాగా డ్రాప్ అయితే ‘సరిలేరు’ బయ్యర్లకు నష్టాలు తప్పవు అన్న ప్రచారం జరుగుతోంది. 

ఈసినిమా విషయంలో మహేష్ కొన్ని వ్యూహాత్మక తప్పులు చేసాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనీల్ రావిపూడి కామిడీ సీన్స్ పై ఎక్కువ దృష్టిపెట్టి కథ విషయంలో తప్పటడుగు వేస్తున్నప్పుడు మహేష్ కల్పించుకుని ఈమూవీ కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఒక సినిమాను జనం చూసేలా చేయాలి అంటే ఎదో ఒక మ్యాజిక్ చేయాలి.   ముఖ్యంగా ఆసినిమా విశేషాలు పోస్టర్లు కటౌట్లు టీజర్లు ఇలా ఏదో ఒకటి తరుచూ విడుదల చేస్తూ హడావిడి చేయాలి’ ‘సరిలేరు’ కు సంబంధించిన ఈమూవీ విడుదల ఒక నెలరోజులు ముందు ప్రతిసోమవారం ఆమూవీకి సంబంధించిన ఎదో ఒకవిషయం విడుదల చేస్తూ వచ్చినా ఈమూవీ ప్రమోషన్లు ఇతర విషయాలలో మహేశ్ బాబుకు చొరవ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈసినిమాకు సంబంధించి యాంకర్ సుమతో ఒక ఇంటర్వ్యూ మిగతా నటులతో మరోటి వెబ్ సైట్లకు ప్రశ్నల జవాబులు అదీ ఇన్ డైరెక్టుగానే ఇచ్చేసి  వాటికే మహేష్ పరిమితమైపోయాడు అన్నకామెంట్స్ వస్తున్నాయి. ‘మహర్షి’ సినిమా విషయంలో వివిధ న్యూస్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోట్ చేయడం అదేవిధంగా వీకెండ్ వ్యవసాయం అంటూ హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలను చేసిన మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలో ఎందుకు చేయలేదు అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. బహుశా అనీల్ రావిపూడి పై మితిమీరిన ఆత్మ విశ్వాసంతో మహేష్ ఇలా చేసి ఉంటాడు అని భావించినా ఈఏడాది సంక్రాంతి రేసులో ప్రస్తుతానికి మహేష్ వెనకపడ్డాడు అని అనడంలో 

మరింత సమాచారం తెలుసుకోండి: