నిన్న విడుదలైన ‘అల వైకుంఠపురములో’ మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీ సంక్రాంతి విన్నర్ అవుతుంది అన్న అంచనాలకు వచ్చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్ లో అల్లు అర్జున్ ఎక్కడ పవన్ కళ్యాణ్ మహేష్ జూనియర్ ల పేర్లు పేరుకైనా ప్రస్తావించకపోయినా ఈముగ్గురి టాప్ హీరోల మ్యానియాను బన్నీ తన ‘అల వైకుంఠపురములో’ ఉపయోగించుకోవడం టాపిక్ ఆఫ్ డి ఇండస్ట్రీగా మారింది. 


‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ అన్న నాటి నుండి పవన్ అభిమానులకు దూరం అయ్యాడు. లేటెస్ట్ గా మహేష్ అభిమానులకు కూడ బన్నీ అసహనంగా మారాడు. అదేవిధంగా జూనియర్ అభిమానులకు కూడ బన్నీ పై పెద్దగా ప్రేమలేదు. ఇలా ఈ ముగ్గురు టాప్ హీరోల అభిమానులతో గ్యాప్ ఉన్న బన్నీ అల మూవీలో కొన్ని సీన్స్ చేసి ఆ ముగ్గురి టాప్ హీరోల అభిమానుల కోపాన్ని తగ్గించడానికి తనవంతు వ్యూహాత్మకంగా ప్రయత్నించాడు. 

మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలో పాటను ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఒక సందర్భంలో పెట్టారు. అదే సన్నివేశానికి కొనసాగింపుగా తారక్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో పాట కూడా ఈ మూవీలో కనిపిస్తుంది. ఈ రెండు సందర్భాల్లో వచ్చే సీన్ లో అల్లు అర్జున్ కనిపించి మహేష్ తారక్ అభిమానులకు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాడు.

ఇది చాలదు అన్నట్లుగా పవన్ నటించిన మూవీలోని పాటను ఈ మూవీలో ఉపయోగించుకోవడమే కాకుండా ఏకంగా ఆపాటకు అల్లు అర్జున్ స్టెప్స్ వేయడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఇదే పద్ధతిని కొనసాగిస్తూ చిరంజీవి హిట్ సాంగ్ కు కూడా స్టెప్పులు వేసి బన్నీ తన ‘అల’ మూవీ ద్వారా తాను అందరి వాడిని అని తెలియ చెప్పడానికి గట్టి ప్రయత్నాలే చేసాడు. దీనితో ఇప్పటికే బన్నీ పేరు చెపితే మండిపోతున్న పవన్ మహేష్ తారక్ అభిమానులు ఎంతవరకు చల్లబడతారో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: