‘అల వైకుంఠపురములో’ మూవీని ప్రమోట్ చేస్తూ త్రివిక్రమ్ చేసిన కొన్ని కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిన విషయమే అయిన నేపధ్యంలో త్రివిక్రమ్ ఇలాంటి సలహాలు పవన్ కు ఎందుకు ఇచ్చాడు అంటూ పవన్ అభిమానులు మండిపడుతున్నారు. 

ఇక వివరాలలోకి వెళితే ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించిన ఆ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. పవన్ నటించబోతున్న ‘పింక్’ రీమేక్ మూవీకి మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారా అన్న ప్రశ్నకు త్రివిక్రమ్ స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. 

తాను ‘పింక్’ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ విషయంలో ఎటువంటి సలహాలు ఇవ్వడం లేదనీ కేవలం ఆ మూవీ కథ పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చుతుంది అని సలహా ఇవ్వడమే కాకుండా పవన్ రీ ఎంట్రీకి సరిపోయే సినిమా అని మాత్రమే తాను పవన్ కు సలహా ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు ఈ మూవీ విషయంలో తానే చొరవ తీసుకుని పవన్ దిల్ రాజ్ ల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడ లీక్ చేసాడు. 

ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలోని ఆ విషయాలు అన్నీ పవన్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో పవర్ స్టార్ లాంటి మాస్ హీరోకు ఇలాంటి కథను త్రివిక్రమ్ సూచించాడు అని తెలియడంతో మండి పడిపోతున్నారు. పవన్ అభిమానుల అభిప్రాయంలో ‘పింక్’ రీమేక్ పవన్ కు ఏమాత్రం సరిపోదు అన్న భావన ఉంది. దీనితో పవన్ రీ ఎంట్రీ మూవీ ‘పింక్’ కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ‘అజ్ఞాతవాసి’ లాంటి భారీ ఫ్లాప్ ఇచ్చి పవన్ కు సినిమాల పై విరక్తి కలిగేలా చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మళ్ళీ ‘పింక్’ రీమేక్ విషయంలో పవన్ కుఎందుకు తప్పుడు సలహాలు ఇచ్చాడు అంటూ పవన్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: