బన్నీ నటించిన అలవైకుంఠపురములో చిత్రం రిలీజై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విమర్శకుల నుండి మంచి రివ్యూలు వచ్చాయి. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చుతోంది. అయితే ఈ సినిమా అనంతరం బన్నీ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. బన్నీసినిమా చిత్రీకరణలో జాయిన్ అవడానికి ఇంకా సమయం ఉంది.

 

ఎర్ర చందనం స్మగ్లింగ్  నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నట్లు సమాచారం. సుకుమార్ సినిమాలో హీరో పాత్ర ఎంత విలక్షణంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అన్ని సినిమాల్లోలాగే ఈ సినిమాలో హీరో పాత్ర చాలా బాగుంటుందట. రంగస్థల సినిమాలో రామ్ చరణ్ ని చూపించినట్లుగానే ఈ సినిమాలో బన్నీ కనిపిస్తాడని... ఆ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సమాచారం.

 

ఇక ఈ ఎర్ర చందనం నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి ఎక్కువభాగం ఔట్ డోర్ లోనే షూటింగ్ జరగనుంది. చిత్తూరు జిల్లా ప్రాంతంలోనే షూటింగ్ ఉంటుందట. దీనికోసం ఆ జిల్లా వాసులనే యాక్టర్లుగా పెట్టుకుంటున్నాడట సుకుమార్.. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మేరకు సుకుమార్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన వీడియోలో అడవుల్లో షూటింగ్ చేస్తున్న వీడియోని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

 


ఆ వీడియోలో విజువల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చుట్టూ చెట్లు... కొండలు... జలపాతాల నడుమ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మరి జస్ట్ రిలీజ్ చేసిన వీడియోలోనే ఇంత బాగుంటే మరి సినిమా ఇంకెంత బాగుంటుందో అని ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: