సంక్రాంతి రేసుకు రావలసిన సినిమాలు అన్నీ వచ్చేయడంతో ధియేటర్లు అన్నీ ప్రేక్షకులతో కళకళలాడి పోతున్నాయి. ఇక ఈ రేస్ లో చివరిగా రేపు విడుదల కావలసి ఉన్న ‘ఎంత మంచి వాడవురా’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ జూనియర్ తో తనకు ఉన్న బంధం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

తనకు తారక్ తమ్ముడు అయినప్పటికీ అతడితో తనకు ఎటువంటి కమర్షియల్ బంధాలు లేవనీ చెపుతూ తాను బంధుత్వాలకు ప్రాధాన్యత ఇస్తాను కాని కమర్షియల్ బంధాలకు కాదు అంటూ కామెంట్ చేసాడు. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలి అని వస్తున్న సూచనల పై స్పందిస్తూ అటువంటి ఆలోచనలు తనకు ఎప్పుడు రాలేదని వాస్తవానికి ఇలాంటి చర్చలు తనకు జూనియర్ మధ్య ఎప్పుడు జరగలేదనీ కామెంట్ చేసాడు.

తన సొంత నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో జూనియర్ తో సినిమాలు తీయాలి అన్న కోరిక ఉంది కానీ తాను తారక్ తో కలిసి నటించాలి అన్న కోరిక తనకు ఎప్పుడు లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇదే సందర్భంలో తన తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ ఒక ఫాంటసీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు లీకులు ఇచ్చాడు.

అదేవిధంగా తన సొంత బ్యానర్ పై ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా గురించి కూడా క్లారిటీ తాను ఇవ్వలేనని చెపుతూ అంతా ఓకే అయిన తర్వాతే అఫీషియల్ గా ప్రకటిస్తాను అంటూ వివరణ ఇచ్చాడు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటికే మహేష్ బన్నీ ల సినిమాల ఫలితం తేలిపోవడంతో సంక్రాంతికి రాబోతున్న ‘ఎంత మంచి వాడవురా’ ఎంత వరకు కళ్యాణ్ రామ్ సంక్రాంతి సెంటిమెంట్ ను నిలబెడుతుందో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: