తెలుగు సినిమాల్లో రోజు రోజుకీ తెలుగు హీరోయిన్లు తగ్గిపోతున్నారు. ఎక్కడో ఒక సినిమాలో తప్పితే ఎక్కువగా కనిపించట్లేదు. తెలుగులో హీరోయిన్ అవకాశం కోసం ఎదురుచూసే వాళ్ళు చాలా మందే ఉన్నప్పటికీ వారికి అవకాశం ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. ఇదే విషయాన్ని చాలా మంచి డైరెక్టర్లని అడిగితే తెలుగులో హీరోయిన్లు దొరకట్లెదనే సమాధానం చెప్తారు. ఏది ఎలా ఉన్నా తెలుగు సినిమాల్లో మాత్రం తెలుగు అమ్మాయిలు తగ్గిపోతున్నారనేది వాస్తవం.

 

అయితే ప్రస్తుతం ఒక తెలుగు హిరోయిన్ కి తమిళంలో మంచి అవకాశం వచ్చింది. తెలుగులో అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ దేవరకొండతో టాక్సీవాలా అనే సినిమాలో నటించిన ప్రియాంకా జవాల్కర్ తమిళ సినిమాలో నటించనుంది. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన ఈ భామకి టాక్సీవాలాలో అవకాశం రావడంతో ఈ భామకిక తిరుగులేదని అనుకున్నారు. టాక్సీవాలా ఆ చిత్రం ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. అందం, అభినయంతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. 

 

సినిమా విజయం సాధించడంతో ఆమెకు పెద్ద ఆఫర్లు కూడా వచ్చాయని వార్తలు వచ్చాయి. కానీ సినిమాలేవీ సెట్ కాలేదు. దీంతో హిట్ తర్వాత కూడా ఆమె ఆఫర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే మొత్తానికి ఈ అమ్మడుకి తమిళంలో నటించే అవకాశం వచ్చింది. సిద్దార్థ్ హీరోగా అమృతరాజ్ అనే కొత్త దర్శకుడు  సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో సిద్దార్థ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. 

 

అందుకే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వారిలో ఒకరు నివేథా థామస్ కాగా మరొకరు ప్రియాంక జవాల్కర్ అని తెలుస్తోంది. ఈ వార్తపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే క్లారిటీ రావాలంటే ప్రియాంకా జవాల్కర్ ఖచ్చితంగా స్పందించి తీరాల్సిందే. మరి ఈ సినిమాతోనైనా ప్రియాంక నటిగా బిజీ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: