తెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాథ్ కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. తన కెరీర్ మొదటిలో ఒక ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ గా పేరు పొందిన పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టరైజేషన్ ను ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు గుర్తు పెట్టుకుంటాడు. కరెక్టుగా చెప్పాలంటే "హీరోలందరూ పూరి హీరోలు వేరయా..!" అని అనాలి.

 

అయితే మధ్యకాలంలో పూరి జగన్నాథ్ అసలు ఫామ్ లో లేడు. పెద్ద హీరోలతో సినిమాలు చేయలేక.. చిన్న హీరోలతో ఫ్లాప్ సినిమాలు తీస్తూ.. అస్సలు కం బ్యాక్ ఇవ్వలేక చాలా సంవత్సరాలు ఇబ్బంది పడిన పూరి గత ఏడాది రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో భారీ హిట్ కొట్టాడు. మరీ పూరి పాత సినిమాల రేంజ్ కాకపోయినా కేవలం అతని మాటల్లోని బలమే సినిమాని విజయం వైపు నడిపించాయి. కానీ కంటెంట్ చాలదా అతనికి అవార్డులు కొల్లగొట్టేందుకు?

 

సినిమా తాజాగా జీ సినీ అవార్డ్స్ ప్రకటించిన జీ సినీ అవార్డ్స్‌లో స‌త్తా చాటింది. పూరీ జ‌గ‌న్నాథ్ బెస్ట్ సెన్సేష‌న‌ల్ డైరెక్టర్‌గా, రామ్ బెస్ట్ సెన్సేష‌న‌ల్ హీరోగా, ఛార్మి బెస్ట్ సెన్సేష‌న‌ల్ ప్రొడ్యూస‌ర్‌గా, బెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీగా ఇస్మార్ట్ శంక‌ర్,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మ‌ణిశ‌ర్మలు ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రానికి అవార్డులు పొందారు.

 

ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ తీస్తానని చెప్పిన పూరి…. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: