నందమూరి ఫ్యామిలీకి ఫ్యాన్ బేస్ ఎక్కువే.. నట సింహం నందమూరి బాలకృష్ణ.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు చేసిన సినిమాలను సూపర్ హిట్ చేయడం తమ బాధ్యత అనేలా ఫ్యాన్స్ ఉత్సహాం ఉంటుంది. అయితే సినిమాలో విషయం ఉంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సిని ప్రేక్షకుడు సైతం సినిమాను ప్రమోట్ చేస్తాడు. అదే ఫ్యామిలీ నుండి వచ్చిన కళ్యాణ్ రాం మాత్రం ఇంకా స్టార్ హీరోగా ప్రమోట్ అవలేదు. తనకు వచ్చిన నచ్చిన సినిమాలు చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న కళ్యాణ్ రాం ఈ సంక్రాంతికి ఎంత మంచి వాడవురా సినిమాతో వస్తున్నాడు.

 

తొలిచూపులోనే సినిమా నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన 118 సినిమా కళ్యాణ్ రాం కెరియర్ లో హిట్టు సినిమాల కన్నా ఫ్లాపులే ఎక్కువ. 17 సినిమాలు చేసిన కళ్యాణ్ రాం కెరియర్ లో నాలుగంటే నాలుగు సూపర్ హిట్ రెండు యావరేజ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకు కళ్యాణ్ రాం ఒక హిట్టు కొట్టిన వెంటనే మరో హిట్టు సినిమా పడలేదు. లాస్ట్ ఇయర్ 118 తో హిట్ అందుకున్న కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఆయన సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా తేడా కొడుతుందని అంటున్నారు.

 

నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన కళ్యాణ్ రాం హీరోగా తన కాళ్ల మీద తను నిలబడాలని చూస్తున్నాడు. సక్రాంతి కానుకగా వస్తున్న ఎంత మంచి వాడవురా సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రాం సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: