ఈ సంక్రాంతికి బన్నీ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. చాలా నమ్మకంగా చేసిన అల.. వైకుంఠపురంలో సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో ఎంతో ఆనందంలో ఉన్నాడు బన్నీ. బన్నీ నటనకు, త్రివిక్రమ్ మార్క్ ఎలిమెంట్స్ కు సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. దీంతో ధియేటర్లన్నీ పవర్ ప్యాక్ ఫుల్స్ అయిపోతున్నాయి. దీంతో సంబరాలు మొదలుపెట్టేశాడు బన్నీ. ఈ సందర్భంగా తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నాడు. ముఖ్యంగ మెగా హీరోలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు.

 

 

మెగా హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ తో తనపై వస్తున్న విబేధాల గురించి ప్రస్తావిస్తూ.. ‘చిరంజీవి గారు నాకు మావయ్య. పవన్ కల్యాణ్ గారు నాకు చిన్న మావయ్య. వారందరి మధ్య పెరిగాను. రమ్ చరణ్ నేను కజిన్స్. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగాం. మామధ్య మంచి అనుబంధం ఉంది. ఇంట్లో పండుగ సందర్భాల్లో అందరం కలుసుకుంటాం. అందరిలా సరదాగా గడుపుతాం. బయటకొస్తే ప్రొఫెషన్ గా ఉంటాం కాబట్టి మా గురించి రకరకాలుగా అనుకుంటారు. అంతకుమించి మా మధ్య ఎటువంటి విబేధాలు లేవు. స్టార్స్ గా ఉన్నందుకు సంతోషంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

 

సోషల్ మీడియాలో మెగా హీరోలు, అల్లు వారి హీరోలు అంటూ కొందరు సృష్టిస్తున్న అలజడే ఇందుకు కారణం. అల్లు ఫ్యామిలీకి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా బన్నీ హీరోగా తెరంగేట్రం చేసిన నాటినుంచీ మెగాభిమానులు ఎప్పుడూ వేరుగా చూడలేదు. బన్నీ కూడా ఎప్పుడూ చిరంజీవి, పవన్ కల్యాణ్ లు తమకు ఆదర్శమనే చెప్పుకొస్తాడు. ప్రతిసారి వారిని పొగడడం వల్ల తమ గొప్పదనం చెప్పుకున్నట్టు ఉంటుంది తప్ప ప్రేక్షకులకు ఒరిగేదేమీ లేదు అని బన్నీనే ఆమధ్య చెప్పుకొచ్చాడు. అందరం మెగా హీరోలమే అన్న సాయిధరమ్ తేజ్ మాటలు కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: