మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించాడు.  ఈ మూవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ మూవీతో చెవిటివాడి పాత్రలో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు.  గత ఏడాది సంక్రాంతి బరిలో బోయాపాటి దర్శకత్వంలో వినయవిధేయ రామ మూవీతో వచ్చినా.. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

 

ఈ మూవీలో ఎన్టీఆర్ తెలంగాణ మన్యం వీరుడు కొమురం భీమ్ గా కనిపించబోతున్నారు.  ఇక ఎన్టీఆర్ ఆంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో ఇటీవల ఓ వీడియో లీక్ ద్వారా తెలిసిందే. అయితే అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందో అన్న విషయం చాలా సస్పెన్స్ గా తీస్తున్నారు... ప్ర‌స్తుతం ఆయ‌న‌పై చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.  వికారాబాద్ అడ‌వుల్లో ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతుంది.

 

 

రాజ‌మౌళి..చెర్రీతో భారీ యాక్ష‌న్ సీన్ ప్లాన్ చేసిన నేప‌థ్యంలో సెల‌బ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైన‌ర్ రాకేష్ ఉడియార్ ఆధ్వ‌ర్యంలో రామ్ చర‌ణ్ జిమ్‌లో కుస్తీలు ప‌డుతున్నాడు. అయితే ఏ మూవీ అయినా తన లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు రామ్ చరణ్. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు గా కొత్త లుక్ కోసం జిమ్ లో తెగ కసరత్తు చేస్తున్నారు. తాజాగా జిమ్‌లో రామ్ చ‌ర‌ణ్ వ‌ర్కవుట్ చేస్తున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్, ఒలీవియా,అలిస‌న్ డూడీ, రే స్టీవెన్ స‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ మూవీ జూలై 30,2020న విడుద‌ల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: