ఏ మనిషికైనా ఉండే ప్రధానమైన కోరికల్లో ఒకటి ఇల్లు కట్టుకోవడం. ఎక్కువ సంపాదించే వారైనా.. తక్కువలో సంపాదన ఉన్నవారైనా సొంత ఇల్లు ఉన్నవారే సమాజంలో ధైర్యంగా బ్రతకగలరు. ఇందుకు రోజు కూలీ నుంచి ఉన్నతవర్గాల వారి వరకూ ఎవరూ అతీతులు కారు. తమకు ఉన్నదాంట్లో ఎవరు ఇల్లు కట్టుకున్నా ఇలానే ఆలోచిస్తారు. ముఖ్యంగా సినిమా వాళ్లు తమ ఇళ్లను లావిష్ గా నిర్మించుకోవాలని స్టైల్ గా ఉండాలని ఇంటిని చూస్తే ఖర్చు కనపడాలని కోరుకుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు.

 

 

పెళ్లైనప్పటి నుంచీ బన్నీ తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నాడు. పెళ్లై ఇన్నేళ్లయినా బన్నీ సొంత ఇల్లంటూ కట్టుకోలేదు. ప్రస్తుతం బన్నీ సొంతంగా కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ ఇంటి విషయంలో బన్నీ తన టేస్ట్ కు తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనిపై రీసెంట్ గా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కొత్త ఇల్లు కట్టుకుంటున్నాను. ఖర్చుకు వెనుకాడకుండా ఈ ఇంటిని అన్ని హంగులతో నిర్మించుకుంటున్నాను. ఏ సినీ హీరో ఇల్లు కూడా ఉండనంత ఆధునిక హంగులతో, లావిష్ గా ఈ ఇంటిని నిర్మించుకుంటున్నాను. నాకు ఏదైనా అత్యాధునికంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలని కోరిక. ఆ విధంగానే నా కొత్త ఇల్లు ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.

 

 

 బన్నీ ఏం కొన్నా స్టైలిష్ గా, లావిష్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. తాను కొన్న కొత్త కారు, తన కారవాన్ ల గురించి ఇది వరకే తెలిసిందే. ‘ఫాల్కన్’ అని పేరు పెట్టుకున్న తన కారవాన్ కే 7కోట్లు ఖర్చు పెట్టాడని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో బన్నీ కొత్త ఇంటి వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్టైలిష్ స్టార్ అన్న తన బిరుదుకు తగ్గట్టే బన్నీ ఇలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: