టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి  కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే  వరుస  సినిమా విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు... తీసిన సినిమాలన్నీ భారీ విజయాలు సాధించేలా మలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మొదటిసారి ఓ సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు ట్రైలర్ కూడా భారీ రేంజ్లో స్పందన వచ్చింది అంతేకాకుండా ఈ సినిమాలో పదమూడేళ్ల తర్వాత టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తుండడంతో ఈ సినిమా పై మరింత హైప్ పెరిగింది. ఇక ఈ సినిమా జనవరి 11న సంక్రాంతి పండుగ ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. 

 

 

 ఇక ఈ సినిమా ప్రేక్షకుల అందరికి మరో  సంక్రాంతి పండుగల మారిందనే చెప్పాలి. ప్రేక్షకులు అందరి అంచనాలను సంతృప్తి పరిస్థితి సినిమా పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సాధారణ కథకి దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన కామెడీ స్టైల్ ఇచ్చి సినిమాను తెరకెక్కించడం... ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు అదరగొట్టడంతో ప్రేక్షకులందరూ హోరెత్తి పోయారు.ఇక ఈ సినిమా  బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనమే సృష్టించింది ఈ సినిమా. ఇక ఎప్పుడూ క్లాస్ గా  మిల్కీ బాయ్ లా కనిపించిన మహేష్ బాబు సినిమాలో మాస్ యాక్షన్ తో అదరగొట్టేశాడు. ఇక డాన్సులు కూడా ఇరగదీశాడు మహేష్ బాబు. 

 

 

 బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది సరిలేరు నీకెవ్వరు సినిమా. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 46.77 కోట్ల షేర్ రాబట్టింది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఇక రెండవ రోజు 20 కోట్ల వరకు షేర్స్ రాబట్టింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లకు చేరువగా వచ్చినట్లు ట్రేడ్ అనలిస్టులు  విశ్లేషిస్తున్నారు. ఇక రాబోయే పండుగ మూడు రోజుల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా ఈ సినిమా ఈ విజయంతో  ఇప్పటికే వరుస బ్లాక్బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు  ఖాతాలో  మరో హిట్  చేరినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: