టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. వినాయకుడు మూవీలో హీరోగా అలరించిన నటుడు కృష్ణుడు గత కొంత కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. అడవి సాయికిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది.  తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. భారీకాయంతో ఉన్న అందమైన ముఖ వచ్ఛస్సుతో నటుడిగా మెప్పించారు కృస్ణుడు.  నటుడిగా మంచి ఫామ్ లో ఉండగానే ఆయన రాజకీయాల వైపు మళ్లారు.   ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ వెంట నడుస్తూ.. ఆయన ఆదర్శాలకు మంచితనానికి ఆకర్షితుడైన కృష్ణుడు వైసీపీ పార్టీలో చేరారు.   టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణుడు. రాజకీయాల్లో చేరిన తర్వాత కృష్ణుడు సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. 

 

ప్రస్తుతం ఆయన రాజకీయాలవైపే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది.  వినాయకుడు మూవీతో హీరోగా పేరు తెచ్చుకున్నా... తర్వాత కొన్ని చాలా సినిమాల్లో కమెడియన్ గా తన సత్తా చాటుతూ వచ్చారు.  అయితే ఆయన లావుగా ఉన్నా.. తన మేనరీజంతో అందరినీ కడుపుబ్బా నవ్వించేవారు.  తాజాగా కృష్ణుడు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి అల్లూరి సీతారామరాజు సోమవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా భీమవరం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సీతారామరాజు ఈరోజు మరణించారు.  జనవరి 13న అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

అయితే నటుడు కృష్ణుడు తండ్రి కన్నుమూశారని తెలిసిన తర్వాత టాలీవుడ్ వర్గం ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు.  మరోవైపు వైసీపీ నేతలు సైతం కృష్ణుడు కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు.. ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  ఇదిలా ఉంటే ఇటీవల టాలీవుడ్ లో పలు విషాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ప్రముఖ నిర్మాతలు, దర్శకులు కన్నుమూశారు.  ప్రస్తుతం సినిమా బిజీ తగ్గిన తర్వాత సీఎం జగన్ వెంట పయనిస్తున్నారు నటుడు కృష్ణుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: