ఈ సంవత్సరం సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. పెద్ద హీరోల సినిమాలు..చిన్న  సినిమా హీరోల సినిమాలు అని తేడా లేకుండా భారీగానే సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఇప్పటికే రజనీకాంత్ దర్బార్... మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటే.. మరో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా మెహరిన్ హీరోయిన్ గా దర్శకుడు సతీష్ విగ్నేషన్  కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఎంత మంచి వాడవురా. ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 

 కాగా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి భారీ పోటీ నెలకొంది. కథ మీద నమ్మకంతో కళ్యాణ్ రామ్  సంక్రాంతికి తన సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కళ్యాణ్ రామ్  భారీగానే హోప్స్ పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు వరకు  మీ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ సరైన స్టార్ డమ్  మాత్రం సంపాదించుకోలేక పోయారు కళ్యాణ్ రామ్ . ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని కళ్యాణ్ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే కళ్యాణ్ రామ్ కు నందమూరి ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇక కథ బలంగా ఉండి ప్రేక్షకులను నచ్చితే మిగతా ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ రామ్ సినిమా చూడడానికి ఎక్కువ మొగ్గు చూపే వీలుంది . 

 

 

 

 ఇక దర్శకుడు సతీష్ విగ్నేషన్  కూడా  కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు ఉంది. ఇక చిత్ర బృందం  ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే హీరో కళ్యాణ్ రామ్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిపాడు. ఈ సినిమాలో హీరో ఏది నెగిటివ్ గా తీసుకోకుండా ప్రతి విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తారని... మిగతా వారిని కూడా ఫాజిటివ్  గా మార్చడానికి ప్రయత్నిస్తారని.. కథ చాలా బలంగా ఉంటుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ముందుగా ఈ సినిమాలో హీరో పాత్రను బట్టి ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు . అయితే తెలుగుదనం నిండిన టైటిల్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పడం తో ఎంత మంచి వాడవురా అనే టైటిల్ ను సెట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్... అయితే ఈ కథ విషయంలో తమ్ముడు ఎన్టీఆర్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు అంటూ తెలిపాడు. ఈ కథ ప్రేక్షకులందరూ మెప్పిస్తుంది అనే నమ్మకం ఉంది అంటూ ధీమా వ్యక్తం చేశారు కళ్యాణ్ రామ్ .

మరింత సమాచారం తెలుసుకోండి: