స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణతో పాటుగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కలిసి నిర్మించిన ఈ సినిమా జనవరి 12 ఆదివారం రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సినిమా కోసం ఎవరెవరు ఎంతగా కష్టపడ్డారన్నది వారు చెప్పారు.

 

ఇక ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన సునీల్ తన మాటలతో అందరిని మెప్పిచాడు. సినిమా సక్సెస్ ను ఉద్దేశిస్తూ త్రివిక్రం గురించి చెప్పిన సునీల్ మావాడికి లక్ష్మీ బాంబు.. సీమటపాకాయలు కాదు.. వేస్తే న్యూక్లియర్ బాంబే అనేశాడు. త్రివిక్రం కొడితే బొమ్మ బ్లాక్ బస్టరే అనేలా సునీల్ మాట్లాడాడు. ఇక తనని 20 ఏళ్ల క్రితం దత్తత తీసుకుని తన ప్రతి సినిమాలో తనని తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో మళయాళంలోకి అడుగు పెట్టా అక్కడ నుండి కూడా అవకాశాలు రావొచ్చని అన్నారు సునీల్.

 

ఇక త్రివిక్రం శ్రీనివాస్ కూడా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మొదట ఫైట్ మాస్టర్ రాం లక్ష్మణ్ ల గురించి మొదలు పెట్టిన త్రివీక్రం ఈ సినిమా మొదలు పెట్టడం ఫైట్ తోనే మొదలు పెట్టాం అందుకే వాళ్లే స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పారని అన్నారు త్రివిక్రం. ఇక సినిమా నిర్మాతలు కూడా రూపాయ్ అడిగితే అంతకు రెట్టింపు ఇచ్చి సినిమా విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చేశారు. ఈ సినిమాతో బన్ని గొప్ప నటుడిగా గుర్తించబడతాడని.. అది తనకు అంతకుముందే తెలిసినా ఈ సినిమా ద్వారా అందరికి తెలుస్తుందని.. ఇప్పటివరకు అతను చేసిన సినిమాల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే అని అన్నారు త్రివిక్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: