సంక్రాంతి సందర్భంగా ఆదివారం రిలీజైన అల వైకుంఠపురములో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ థ్యాంక్స్ మీట్ లో మాట్లాడిన అల్లు అరవింద్ సినిమా షూటింగ్ టైంలోనే రష్ చూసి హిట్ అనుకున్నానని అన్నారు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాను చాలా ఈజీగా చేశాడు, త్రివిక్రం కథ చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ బాగుందని అనుకున్నాం.. కాని మా టీం లో కొందరు మరీ ఈ కథతో ఎలా వెళ్లగలం అన్నారు.

 

కాని త్రివిక్రం మీద నమ్మకం ఉంచి ఈ సినిమా చేశామని.. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా సక్సెస్ మీట్ లో మాట్లాడుతానని.. ఈ నెల 18న వైజాగ్ లో సక్సెస్ మీట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశామని అన్నారు అల్లు అరవింద్. మొత్తానికి కొడుకు హిట్టు కొట్టగా అల్లు అరవింద్ ఆ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక సినిమా కళామతల్లికి ఒక రూపం ఉంటే ఆమె పాదాల దగ్గర మేము మా కుటుంబం సేవ చేస్తుందని అన్నారు. 

 

సినిమా కలక్షన్స్ గురించి మాత్రం సక్సెస్ మీట్ లో ఎనౌన్స్ చేస్తామని అన్నారు అల్లు అరవింద్. త్రివిక్రం కూడా ఈ సినిమాతో అల్లు అరవింద్ గొప్ప నటుడిగా గుర్తింపబడతాడని అన్నారు. అల వైకుంఠపురములో సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన థమన్ సినిమాను రిలీజ్ ముందే హిట్ చేశాడని.. ఆల్రెడీ హిట్ అయిన మ్యూజిక్ కు మేం మ్యాచ్ చేశామని అన్నారు త్రివిక్రం. తమన్ మ్యూజిక్, పూజా హేగ్దే అందాలు, బన్ని ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ సినిమాను సూపర్ హిట్ చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: