ఎవరి పేరు వినగానే నవ్వు పెల్లున వస్తుంది అంటే గుర్తొచ్చేది కామెడీ కా బాద్షా నవ్వుల నవాబు హాస్య కీరిటి బ్రాహ్మ నందం...తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బ్రహ్మీ.. ఎన్నో సినిమాలలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు..అయితే ఆయన ప్రస్తుతం అన్న మాటలు సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తున్నాయి అసలు ఆయన అంత రచ్చ అయ్యేలా ఎంచేశాడు.. ఎం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జు్న్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. విడుదలైన తొలిరోజే సినిమా కేక అని ప్రేక్షకులు రేటింగ్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ‘అల వైకుంఠపురములో’ టీం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా హాస్య బ్రహ్మ మాట్లాడుతూ..ఈ సినిమాలో నాకో మంచి పాత్రను వీళ్ళు ఇచ్చారు చాలా సంతోషం.. ఇప్పుడు నాకు మరింత గర్వంగా ఉంది అంటూ ఆయన అన్నారు..

 

నాకు సర్జరీ అయింది అది అయ్యాక బన్నీ నన్ను కలిసి మీరు స్ట్రాంగ్.. ఆ తర్వాత మీకు నాయమయ్యక మొదటగా నా సినిమాలోనే చేస్తున్నారు.. అంటూ అన్నాడు.. చాలా మంచి పిల్లాడివి అన్నాను.. ఆ తర్వాత త్రివిక్రమ్ నాకోసం ఓ కథ రాయడం అన్ని చేసుకోవడం రాములో రాములో పాటలో నన్ను పెట్టడం అన్నీ ఒకేసారి జరిగిపోయింది..

 

నా గురువుగారు అల్లు రామలింగయ్య అన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఒక్క రిమార్క్ కూడా లేని వ్యక్తి. ఆయన నాతో ఎప్పుడూ ఓ మాట అంటుండేవారు. రేయ్ నువ్వు ఎవరి హీరో దగ్గరికైనా వెళ్తే ఆ హీరో గురించే మాట్లాడు. మరో హీరో గురించి ఒక్క మాట మాట్లాడకు. ఎందుకంటే ఆ ఇద్దరు హీరోలు కలిసిపోతే మనం ఔటైపోతాం అని చెప్పేవారు. అలాంటి వ్యక్తి అల్లు అరవింద్ రూపంలో గొప్ప కొడుకు పుట్టాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ తన తండ్రి గురించి మాట్లాడుతూ కన్నీరుపెట్టుకున్నాడు. అరవింద్ తన తండ్రి చనిపోయాక ఎంత బాధపడ్డాడు అన్నది నేను స్వయంగా చూసాను.. బన్నీ కూడా అంతే అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈయన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: