నటి ఇలియాన అంటే తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండరు. ఎందుకంటే అనతి కాలంలోనే అంతగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇకపోతే వై.వి.యస్.చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఇలియానా ఈ సినిమాలో, రామ్ సరసన నటించింది..  ఇక ఈ చిత్రం ఇద్దరికీ తొలిచిత్రమైన విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది.

 

 

ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించిన ఈ గోవా బ్యూటీ అప్పటివరకు తెలియని వారికి కూడా తెలిసిపోయింది. పోకిరి చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. అంతే కాకుండా రవితేజతో చేసిన నాలుగు సినిమాల్లో మూడు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. కిక్ మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.

 

 

ఇదిలా ఉండగా దాదాపుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోని ప్రముఖ హీరోల సరసన నటించింది ఈ అమ్మడు. అయితే ఆ తర్వాత బాలీవుడ్ పై మనసు పారేసుకున్న ఈ అమ్మడు అటు వైపు తన మకాం మార్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ప్రముఖ ఛానల్  ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఇలియానా, ఇందులో భాగంగా తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.

 

 

అదేమంటే తన చిన్నప్పుడు ఇంటి పక్కనే ఉన్నటువంటి ఓ అబ్బాయిని ప్రేమించానని ఆ క్రమంలోనే అతడికి రోజు లైన్ వేస్తూ ఉండేదాన్ని కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అతడికి అప్పుడు నేను నచ్చలేదని అన్నారు. దాంతో తన మొదటి క్రష్ అలా కలగా మిగిలి పోయిందని తెలిపారు.

 

 

ఇకపోతే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలియానా ప్రేమ వ్యవహారం గురించి అడగగా తన ప్రేమ వ్యవహారం పూర్తిగా వ్యక్తిగతమని దాని గురించి బహిరంగం చేయడం తనకు ఇష్టంలేదని సున్నితంగా తిరస్కరించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: