మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో కిక్ బాక్సింగ్ .. మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో ఇప్పటి వరకూ చాలా సినిమాలొచ్చాయి. అయితే ఆ సినిమాలన్నిటి కంటే కంప్లీట్ డిఫ్రెంట్ గా ఈ బ్యాగ్డ్రాప్ లో సినిమా తెరకెక్కించాలన్నదే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి కి ఉన్న ఒక కోరిక. ఈసారి ఎంచుకునే కాన్సెప్ట్ యూనివర్శల్ యాక్సెప్టెన్సీ తో ఉండాలి. రొటీన్ గా లోకల్ గా చూసే సినిమాగా ఉండకూడదని ఆలోచించిన పూరి అందుకు తగ్గట్టుగానే అందరు షాకయ్యో స్క్రిప్టు ను రెడీ చేశాడట. విజయ్ దేవరకొండ హీరోగా పూరి- ఛార్మి కలిసి పాన్ ఇండియా కేటగిరీ లో భారీ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబై లో చిత్రీకరణ ప్రారంభించే ఏర్పాట్లు చేశారని వార్తలొచ్చాయి. తెలుగు-తమిళం సహా హిందీ లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్స్ ని పూరి ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

 

హిందీ బెల్ట్ లో డిస్ట్రిబ్యూటర్ కం దర్శక, నిర్మాత కరణ్ జోహార్ పూరి టీమ్ కి సాయం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఫైటర్ జాతీయ స్థాయి ప్రాజెక్టుగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది రౌడీ-పూరి టీమ్ పైనా మరింత  బాధ్యత పెంచిందనే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్.. నేర్చుకునేందుకు థాయ్ ల్యాండ్ వెళ్లారని తాజా సమాచారం. అక్కడ మన విజయ్ దేవరకొండకి ఏకంగా 15 మంది థాయ్ స్పెషలిస్టులు మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో కఠోరమైన శిక్షణను ఇవ్వనున్నారట.

 

కిక్ బాక్సింగ్.. కరాటే..కుంగ్ ఫూ.. థైక్వాండో.. కర్ర సాము .. వీటన్నిటినీ మిక్స్ చేసే శిక్షణ అని తెలిస్తోంది. ఈ విద్యల్లో అన్ని రకాలుగా రాటు దేలాక విజయ్ తిరిగి వస్తాడని తెలుస్తోంది. ఇందు కోసం విజయ్ స్ట్రిక్ట్ గా డైట్ సహా ఫిగర్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు. బాడీ ఫాస్ట్ మూవ్ మెంట్ కి కావాల్సిన పర్‌ఫెక్ట్ ఫిజిక్ ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. 2021 సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాల పూరీ టీం ప్లాన్ చేస్తున్నారట. ఈలోగానే ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాని పూరి-ఛార్మి బృందం రిలీజ్ చేస్తారు. ఇక ఫైటర్ కోసం దేవరకొండ కావాల్సినంత టైమ్ తీసుకుని పూర్తిగా తన రూపాన్ని ఎవరూ ఊహించనంతగా మార్పు చేయబోతున్నాడ పూరి సన్నిహిత వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇక ఈ సినిమాకి ఫైటర్ కాకుండా కిక్ బాక్సర్ అన్న టిటిల్ కూడా అనుకుంటున్నట్లు లేటెస్ట్ న్యూస్. కిక్ బాక్సర్ టిటిల్ యునివర్సల్ గా ఉంటుంది కాబట్టి అన్ని భాషలకి సరిపోతుంది కాబట్టి ఫైటర్ కి ఆల్టర్ నేటివ్ గా ఈ టిటిల్ ని అనుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: