టాలీవుడ్ మాస్ మహరాజ ‘ఇడియట్ ’ మూవీతో మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.  తన యాక్షన్, కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ఆ మద్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడి రెండేళ్లు గ్యాప్ తీసుకున్న రవితేజ ఆ మద్య అనీల్ రావిపూడితో ‘రాజా ది గ్రేట్’ లాంటి బ్లాక్ బస్టర్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఇక రవితేజ లైన్ లోకి వచ్చాడని అనుకున్న తరుణంలో మళ్లీ వరుసగా ఫెయిల్యూర్స్ తో సతమతమయ్యారు.  తాజాగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ‘డిస్కోరాజా’.  ఈ మూవీలో తమిళ నటుడు బాబీ సింహా విలన్ గా నటిస్తున్నారు.   

 

సినిమా టీజర్ డిసెంబర్ మొదటివారంలోనే విడుదలయింది. కాగా నేడు సెకండ్ టీజర్‌ను విడుదల చేశారు. పోస్ట్ వార్ స్ట్రెస్సు డిజార్డర్ తెలుసా? సోల్జర్సు సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోనూ ఫైరింగ్స్ తోనూ యుద్ధాలు చేసి రిటైరయ్యి ఇంట్లో ఉంటే సడెన్ గా వచ్చే సైలెన్సు ఉంటది చూడు.. అదప్పటి దాకా వాళ్లు చూసిన వయోలెన్స్ కంటే భయంకరంగా ఉంటుంది... మరి దీనికి మందేంటి డాక్టర్? అని అడిగితే మీ అన్నయ్య లైఫ్ లో ఓ కొత్త ఛాలెంజ్ కావాలి అంటాడు ఆ డాక్టర్.  ‘‘సేతు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం.. భయం గుర్తుకురావాలి’’ అంటూ బాబీ సింహా చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌ అవుతోంది. 

 

మాస్ మహరాజ స్టైలిష్ ఎంట్రీ.. ఫైట్స్ తో అదరగొట్టాడు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రజిని తాళ్లూరి నిర్మిస్తున్నారు. జనవరి 24న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి టీజర్ చూస్తుంటే ఈ మూవీ మరో టాప్ రేంజ్ లో దూసుకు వెళ్తుందా అన్నట్టుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: