ఈ సారి సంక్రాంతి పండగ ముందే వచ్చేసింది. తెలుగులో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవడంతో పాటు ఆ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడం పండగ కాకపోతే మరేమిటి.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకి బాగా వినోదాన్ని పంచింది.

 

అలాగే ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం కూడా ప్రేక్షకుల వద్ద నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతుంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ల పరంగా నాన్ బాహుబలి రికార్డును నెలక్పొల్పిన ఈ సినిమా మరింతగా దూసుకుపోతుంది. అయితే ఈ రెండు పెద్ద సినిమా హీరోల సినిమాలు కావడంతో మొదటి నుండి అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

 

అయితే ఈ సంక్రాంతి రేసులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అవుతున్న చిత్రం కూడా ఉంది. అదే కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా... సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఎక్కువగా అంచనాలు లేవు. కానీ ఈ సినిమా కూడా హిట్టు కొట్టేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే రిలీజైన ప్రోమోలని బట్టి చూస్తుంటే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమాలు హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ.

 

అందువల్ల ఈ సినిమా కూడా హిట్ కొట్టేలా ఉంది. అదీ గాక కళ్యాణ్ రామ్ మొదటి సారిగ ఫ్యామిలీ డ్రామాలో కనిపిస్తున్నాడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తుంది. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీన విలిజ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: