స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అల  వైకుంఠపురములో. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బంపర్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకంటే తాజాగా వచ్చిన అలా వైకుంఠపురము లో సినిమా బంపర్ హిట్ సాధించింది. అల వైకుంఠపురములో  సినిమాలో  అల్లు అర్జున్ సరసన అందాల ముద్దుగుమ్మ పూజాహెగ్డే నటించింది. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం రాములో  రాముల పాటలో  నటించి అందరినీ సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా చిత్ర బంధం థాంక్స్ మీట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం... తన గురువు అల్లు రామలింగయ్య చెప్పిన మాటనే ఇప్పటికీ పాటిస్తాను అంటూ తెలిపారు. అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో  సినిమా బ్లాక్బస్టర్ కలెక్షన్లతో అదరగొడుతున్నదని  బ్రహ్మానందం తెలిపారు. 

 

 

 అలా వైకుంఠపురములో  సినిమాలోని రాములో  రాముల పాట హిట్ కావడానికి కారణం అల్లు అర్జున్ అని అందరూ అనుకుంటున్నారు కాదు... నేను పాటలో ఉండటం వల్ల అని  బ్రహ్మానందం చమత్కరించారు. ఈ సినిమాలో తాను కనిపించడానికి... బ్యాక్ గ్రౌండ్ లో జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. నాకు బైపాస్ సర్జరీ అయ్యాక పరామర్శించడానికి అల్లు అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ అంకుల్ సర్జరీ తర్వాత మీరు చేస్తున్న మొదటి సినిమా నాదే అని వెళ్ళిపోయాడు. అల్లు అర్జున్ అలా అంటే ఏదో ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకున్నా... ఆ తర్వాత త్రివిక్రమ్ వచ్చి సార్ మనం  కల్పిస్తున్నామని చెప్పి వెళ్ళిపోయాడు... సినిమా అయిపోయిందేమో  ప్రమోషన్ కోసం అనుకున్న.. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని నాకు ఓ క్యారెక్టర్ ఇచ్చారు.. అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. 

 

 

 ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్ మాట ఇస్తే నిలబెట్టుకునే వారు అంటూ ప్రశంసించారు. అయితే నాకు  అల్లు రామలింగయ్య ఎప్పుడు ఓ మాట చెబుతూ ఉండేవారు... ఒరేయ్ నువ్వు ఏ హీరో దగ్గరికి వెళ్లిన ఆ  హీరో గురించి మాట్లాడు మరో హీరో  గురుంచి  మాట్లాడితే..ఆ  ఇద్దరు హీరోలు కలిస్తే మనం అవుట్  ఐపోతాం అని చెప్పేవారు. ప్రస్తుతం  మా గురువు  అల్లు రామలింగయ్య గారు చెప్పింది నేను ఫాలో అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. అల్లు రామలింగయ్య లాంటి గొప్ప వ్యక్తికి అల్లు అరవింద్ లాంటి గొప్ప కొడుకు పుట్టాడు అల్లు అరవింద్ మంచివారు కాబట్టి అల్లు అర్జున్ లాంటి మంచి వ్యక్తి కొడుకుగా పుట్టాడు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: