రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. చాలా మంది ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు తమ స్వస్థలాలకు వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పండుగ సందర్భంగా అనేక విషయాలను చర్చించడం కోసం ఆస్తుల విషయంలో విభజన సమయంలో తలెత్తిన సమస్యల విషయంలో సామరస్య వాతావరణంలో తేల్చుకోవటం కోసం తాజాగా ఇటీవల హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఇద్దరు భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ కి వచ్చిన ఏపీ సీఎం జగన్ ని పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సీఎం జగన్ మరియు కేసీఆర్ ఇద్దరూ కలిసి మధ్యాహ్నం భోజనం చేసినట్లు సమాచారం. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి కూర్చుండగా..సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా భోజన సమయంలో కూర్చున్నట్లు తాజా రాజకీయాల గురించి చర్చించుకున్నటు సమాచారం. అనంతరం జరిగిన సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం చర్చలు జరిగినట్లు ఆస్తుల గొడవ ఇంకా అనేక విషయాల గురించి సీఎం జగన్- కెసిఆర్ చర్చించుకున్నట్లు అదేవిధంగా నదీజలాలు, విద్యుత్‌ ఉద్యోగులు తదితర విభజనకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో చర్చించుకున్నట్లు సమాచారం.

 

గతంలో ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గవర్నర్ గా ఉన్న సందర్భంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం జరిగింది. దీంతో అప్పటి సమయంలో  ఖాళీగా ఉన్న సచివాలయ భవనాలను సీఎం కేసీఆర్‌ కోరిక మేరకు తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్‌ సుముఖత వ్యక్తంచేశారు. ఆ వెంటనే సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించారు. అనంతరం విభజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2019 జూన్‌ 11వ తేదీన నాటి గవర్నర్‌కు ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు. స్పందించిన గవర్నర్‌.. విభజన సమస్యలను మంచి వాతావరణంలో పరిష్కరించుకోవాలని కోరుతూ 2019 జూన్‌ 12న ఇరురాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. ఆ తర్వాత జరిగిన ఈ భేటీ లో విభజన సమయంలో ఆస్తుల గొడవ విషయంలో సామరస్య వాతావరణంలో సీఎం జగన్ మరియు కేసీఆర్ ఈరోజు భేటీలో చర్చించినట్లు అందుతున్న సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: