చేసే పని ఏదైనప్పటికి పర్‌ఫెక్ట్ టైమింగ్ చాలా ముఖ్యం. కత్తి లాంటి డైలాగైనా సరే.. టైమింగ్ సరిగా లేకుంటే తుస్సుమంటుంది. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో మాటల మాంత్రికుడు.. తన సినిమాల్లో డైలాగుల తోనే కడుపు నింపేస్తాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళ్కి టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ ను పర్ ఫెక్ట్ గా తీర్చి దిద్దే త్రివిక్రమ్.. తన తాజా సినిమా అల వైకుంఠపురము రిలీజ్ విషయంలో సరైన టైమింగ్ ఎందుకు రిలీజ్ చేయలేదన్నది అంతటా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిర్మాణంలో ఉండగానే భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు ఏమైనా అయితే గురువారం.. లేదా శుక్రవారం మాత్రమే విడుదల అవుతుంటాయి. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే బుధవారమే థియేటర్లకు వచ్చి సందడి చేస్తాయి.

ఇప్పుడు ఇలాంటి వాటికి భిన్నంగా సినిమా విడుదలను ఆదివారం పెట్టుకోవటం ద్వారా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రికార్డును మిస్ చేసుకుంది అల వైకుంఠపురము టీం. ఆదివారం సినిమా విడుదలవడంతో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ కేవలం ఒక రోజుకు మాత్రమే లెక్కలోకి వస్తుందన్నది ఇప్పుడు అసలు పాయింట్. ఈ విషయం అంత పెద్దది కాకపోయినా.. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయకుండా ఉండాల్సిందంటున్నారు. పక్కాగా అన్ని కుదిరిన సినిమాను పండుగ సమయంలో నాలుగు సినిమాల మధ్య బరిలోకి దింపే కన్నా.. విడి రోజుల్లో కానీ రిలీజ్ చేస్తే.. బాక్సాఫీసు లెక్కలు మారటమే కాదు.. కొత్త లెక్కలకు రాసే అవకాశాన్ని మిస్ చేసుకున్నారన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

 

కొన్ని మంచి సినిమాల్ని ఖచ్చితంగా ఫలానా టైంలోనే విడుదల చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అలాంటి విషయాన్ని త్రివిక్రమ్ మాత్రమే కాదు.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింత్ కూడా ఎందుకు మిస్ అయ్యారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్. టైమింగ్ విషయంలో పక్కాగా ఉండే త్రివిక్రమ్ అల వైకుంఠపురము విడుదల విషయంలో మాత్రం లెక్క తప్పారన్న అభిప్రాయం చాలామందిలో కలగటం ఆశ్చర్యకరం. రైట్ సినిమా.. రాంగ్ టైమ్ అన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి సినిమా ఇంత పోటీలో కాకుండా సింగిల్ గా వచ్చి ఉంటే మాత్రం.. లెక్కలు మరోలా ఉండేవన్న మాటలో నిజం ఎంతన్నది పది రోజులు ఆగితే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: