సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు సైతం బయటకు వచ్చి నోరు విప్పిన విషయం తెలిసిందే. తాము కూడా కెరియర్ మొదట్లో ఎంతో మంది నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని తెలిపారు. గతంలో మీ టు పేరుతో క్యాస్టింగ్ కౌచ్ తెరమీదకు తెచ్చి హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీ టు లో  చెప్పటం  సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా చాలా మంది హీరోయిన్లు తెర మీదికి వచ్చి తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఉంటారు.ఇక తాజాగా  బెంగాల్ సినీ పరిశ్రమలో కూడా ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ సీరియల్ లో నటిస్తున్న నటి రూపాంతర మిత్ర మీ టు  ఉద్యమంలో భాగంగా నోరు విప్పింది. ఓ  సీరియల్ కు సంబంధించి స్క్రిప్ట్ గురించి మాట్లాడాలి అని చెప్పి తన కార్యాలయానికి పిలిపించుకుని... తనపై అసభ్యంగా చేయి వేస్తూ లైంగికంగా వేధించారు అంటూ ఆరోపించింది నటి రూపాంతర మిత్ర. 

 

 

 

 భూమి కన్య అనే సీరియల్లో నటిస్తున్న సమయంలోనే... స్క్రిప్టుకు సంబంధించి చర్చించడానికి దర్శకుడు అరవిందం సిల్ సాయంత్రం ఐదు గంటల సమయంలో కార్యాలయానికి రమ్మని పిలిచారని ఆమె తెలిపింది. అయితే వారి కోసం కార్యాలయానికి వెళ్తే కార్యాలయంలో కేవలం మేము  ఇద్దరమే ఉన్నామని... స్క్రిప్ట్ చెప్పేందుకు అని చెప్పి అరిందం  తన సీట్లోంచి లేచి తన వద్దకు వచ్చే ముఖం శరీరాన్ని నిమిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అది భరించలేక తాను దర్శకుడు పై అరిచానని   తెలిపింది నటి రూపాంతర  మిత్ర. స్క్రిప్ట్ వినిపించండి పిచ్చి చేష్టలు చెయ్యద్దు అంటూ గట్టిగా చెప్పాను అంటూ తెలిపింది. 

 

 

 తాను ఒక వేళ ఆ విధంగా చేయకపోతే అత్యాచారం చేసే వాడేమో అంటూ సంచలన  వ్యాఖ్యలు చేసింది. ఇక  అంతలోపే ఆ డైరెక్టర్ భార్య కూడా కార్యాలయానికి రావడంతో పిచ్చి పనులు మాని స్క్రిప్టును వివరించాడు అంటూ చెప్పుకొచ్చింది. సీరియల్ లో నటించడానికి ఒప్పంద పత్రంపై సంతకం చేయాల్సి ఉండడం... తాను నటించిన సీరియల్ టెలికాస్ట్ అవుతున్న ఛానల్ ప్రతిష్టకు బంగం  అని భావించి ఆ విషయాన్ని ఆ సమయంలో బయటకు చెప్పలేదు అని  ఆమె తెలిపారు. అయితే రూపంజన మిత్ర ఆరోపణలను దర్శకుడు అరిందం సిల్  ఖండించారు. ఇదేదో  రాజకీయంలో కనిపిస్తుందని.. మేమిద్దరం  పాత స్నేహితులమని  తనను వేధించారని చెప్పిన రోజు రూపాంతర మిత్ర  తనకు మెసేజ్ చేసింది అంటూ దర్శకుడు ఆరోపిస్తున్నారు. ఆమెను  నేను వేధిస్తే ఇలాంటి మెసేజ్లు ఎందుకు పంపుతుంది అంటూ ప్రశ్నించారు దర్శకుడు అరిందం . ఈ దర్శకుడు పలు  చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: