ప్రిన్స్ మహేష్, రష్మిక మందాన నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలై మూడు రోజులు కావొస్తుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ బాబు అభిమానులను బాగా అలరిస్తుంది. అయితే, ఈ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ భారీ స్థాయిలో ఉందంటే అది అతిశయోక్తి కాదు. 11వ తారీఖున సరిలేరు నీకెవ్వరు రివ్యూ ట్యాగ్ ట్విట్టర్ లో టాప్ ప్లేస్ లో ఉందంటే మహేష్ బాబు కు ఫ్యాన్ ఫాలోయింగ్ కోట్లలో ఉందని అర్ధమవుతుంది. మనకే కాదు ఏకంగా విదేశీయులుకు కూడా మహేష్ బాబు క్రేజ్ అర్ధమైనట్టుంది అందుకే సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ చూసి తెగ రియాక్షన్స్ ఇచ్చారు.


https://youtu.be/YCPnwo96mdA


యూట్యూబ్ లోని 'అవర్ స్టుపిడ్ రియాక్షన్' అనే ఛానల్ లో రిక్, కోర్బిన్ అనే ఇద్దరు విదేశీయులు మాట్లాడుతూ.. సరిలేరు నీకెవ్వరు కథను చదువుతున్నారు. తరువాత ఇంగ్లీష్ సబ్ టైటిల్ టర్న్ ఆన్ చేసిన సరిలేరు ట్రైలర్ ని ప్లే చేసి రష్మిక మందాన క్యూట్ యాక్షన్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తారు. వీళ్ళిద్దరూ ట్రయిన్ సీన్ లో మహేష్ బాబు చెప్పే నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే డైలాగుకు నవ్వుతారు. ఆపై ట్రైలర్ లో మహేష్ కొడితే ఒకతను మెడ నెలకు తగలడంతో ఓహ్వ్ అంటూ ఆశ్చర్యపోతారు. ట్రైలర్ చూడటం పూర్తయ్యాక ఈ సినిమాలో కామెడీ తో సహా అన్ని ఎలెమెంట్స్ ఉన్నాయని, ఒక ఫైట్ లను చూసి మహేష్ బాబు కు అతీంద్రియ శక్తులున్నాయోనని మాట్లాడుకుంటుంటారు.


మన తెలుగు సినిమాలకు విదేశీయులు స్పందించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో సంపూర్ణేష్ బాబు సినిమాకు maxima baby అనే యూట్యూబ్ ఛానల్ లో ఒకతను హాస్యాస్పద రియాక్షన్స్ ఇచ్చి అందర్నీ బాగా నవ్వించాడు. కింద url లింక్ ఇవ్వడం జరిగింది. వాటిని కాపీ చేసి మీ వెబ్ బ్రౌసర్ లో పేస్ట్ చేసి సెర్చ్ చేస్తే మీకు అవి దర్శనమిస్తాయి.

https://youtu.be/49EN9EOSn1E

మరింత సమాచారం తెలుసుకోండి: