అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అల వైకుంఠ పురములో. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. ఎందుకంటే ఇంతకు మునుపే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో జూలై సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు  వచ్చే బంపర్ విక్టరీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో మరోసారి ఈ సినిమా విజయం సాధించడం ఖాయమని ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు  కూడా యూట్యూబ్ ని షేక్  చేసి ప్రేక్షకులను ఆకర్షించి  రికార్డులు  సైతం సృష్టించాయి.  ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

 ప్రేక్షకుల అంచనాలు అన్నింటినీ సంతృప్తి పరుస్తూ ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్లు రాబడుతోంది. సినిమాల్లో మాటల మంత్రి డైలాగ్స్ కి... అల్లు అర్జున్ ఆటిట్యూడ్ ఎనర్జీ తోడవడంతో ప్రేక్షకులు అందరూ ఈ సినిమా చూసి హోరెత్తి పోతున్నారు. అద్భుతంగా ఉంది సినిమా అంటూ చెబుతున్నారు ప్రేక్షకులు. ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఇక వసూళ్ళ పరంగా కూడా రికార్డులు సృష్టిస్తుంది ఈ సినిమా. అయితే గతంలో వరుస ప్లాపులతో సతమతమైన అల్లు అర్జున్ కి ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది అని చెప్పాలి. మరోసారి విక్రమ్ అల్లు అర్జున్ హిట్ కాంబినేషన్ కాదు బంపర్ హిట్ కాంబినేషన్ అని నిరూపించుకోన్నారు. 

 

 

 ఈ సినిమా వసూళ్లు  భారీగా రాబడుతూ  బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నప్పటికీ గట్టిగా  కొట్టాడు.అల  వైకుంఠపురములో సినిమా కలెక్షన్లలో దుమ్మురేపుతుంది. అల  వైకుంఠపురములో సినిమా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ 30 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు ఓవర్సీస్ లో 5 కోట్లు వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. అల వైకుంఠపురం సినిమాకు వస్తున్న వసూళ్లు బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూలు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: