రెండు తెలుగు రాష్ట్రాల సినిమా మార్కెట్ ఎంత పెద్దదన్న విషయం ఈ మధ్య  కాలంలో విడుదలవుతున్న మన సినిమాలకు వస్తున్న కలెక్షన్లను చూస్తున్న మిగిలిన ఇండస్ట్రీలకు బాగా అర్థమయింది.  ఇక భాష ఏదైనా.. కాస్త కంటెంట్ ఉంటే చాలు తెలుగు ప్రజలు ఇట్టే కనెక్ట్ అయిపోతారనటానికి హాలీవుడ్ మూవీ జోకర్ ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంగ్లిషు సినిమాల సంగతి ఇలా ఉంటే.. హిందీ సినిమాలు డబ్బింగ్ లేకున్నా.. తెలుగు నేల మీద భారీ కలెక్షన్లను సొంతం చేసుకోవటాన్ని మర్చిపోకూడదు. అయితే.. ఇందుకు భిన్నంగా ఒక సినిమాను తెలుగోళ్లు అస్సలు పట్టించుకోకపోయినప్పటికి మూడు రోజులలో ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లు భారీగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది.

 

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ తో పాటు.. కాజోల్.. సైఫ్ అలీఖాన్ నటించిన హిందీ పిరియడ్ డ్రామా  తన్హాజీ. అన్ సంగ్ వారియర్ . ఈ సినిమా భారీగా వసూళ్లను సాధిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా కేవలం మూడురోజులకే రూ.61.7 కోట్ల వసూళ్లను సాధించింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు కూడా తెలుగు సినిమాలతో ఫుల్ అయిపోయాయి. శుక్రవారం తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన దర్బార్ బొమ్మతో థియేటర్లు ఫుల్ అయితే.. ఒక్క రోజు వ్యవధి తర్వాత మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా రావటం.. బ్యాక్ టు బ్యాక్ బన్నీ అల వైకుంఠపురములో రావటంతో థియేటర్లు ఖాళీ లేని పరిస్థితి. దీంతో.. తన్హాజీ సినిమాకి బాగా తక్కువ షోలకే పరిమితం చేశారు.

 

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పరిస్థితి ఇలా ఉన్నా.. మహారాష్ట్ర లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. దీంతో.. మూడురోజుల వ్యవధిలో ఏకంగా రూ.61.7 కోట్లు  కొల్లగొట్టింది. ఊహించని రీతిలో దీపికా చపాక్ సినిమా అలరించకపోవటం కూడా ఈ సినిమాకు బాగా హెల్ప్ అయిందని చెబుతున్నారు. సాధారణంగా దీపిక ఏ సినిమాకైనా వచ్చే రెగ్యులర్ ఓపెన్సింగ్స్ కూడా రాకపోవటం.. ఆ ప్రేక్షకులంతా తన్హాజీకి టర్న్ కావటం ఆ సినిమాకి బాగా లాభం చేకూరినట్లు చెప్పుకుంటున్నారు. మన తెలుగు వాళ్లు లైట్ గా తీసుకున్న ఈ బాలీవుడ్ సినిమా కోట్లు కొల్లగొట్టేయటం విశేషం అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: