మన టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేయడంలో సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్.బి.చౌదరి తర్వాత డి.సురేష్ బాబు రారాజు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు కొరియన్ సినిమాలని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టిన రికార్డులు చాలానే ఉన్నాయి. వెంకటేష్-సురేష్ బాబు కాంబినేషన్ అంటేనే దాదాపుగా అన్ని రీమేక్ చేసిన సినిమాలే గుర్తొస్తాయి. పరభాషల్లో బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలని సెలెక్ట్ చేసుకొని రీమేక్ చేసి హిట్ కొడుతుంటారు. ఇక ఇటీవలి కాలంలో కొరియన్ సినిమాల్ని బాలీవుడ్ సినిమాల్ని రీమేక్ చేయడంపై సురేష్ బాబు ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తున్నారు. 2019లో మిస్ గ్రానీ రీమేక్ గా వచ్చిన ఓ బేబి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మకిలీ వంటి సూపర్ హిట్ తర్వాత సమంతకు ఈ సినిమా కొత్త ఇమేజ్ ని తెచ్చింది. 2019 లో సురేష్ బాబు కి ఈ సినిమా నిర్మాతగా మంచి సక్సస్ ని ఇచ్చింది.

 

ఇక 2020 లోనూ డి.సురేష్ బాబు ఈ కోవకి చెందిన సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముందుగా బాలీవుడ్ హిట్ మూవీ అంధాధున్ రీమేక్ ని పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అలాగే కొరియన్ సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్' అనే సినిమాని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. అయితే బ్యాక్ టు బ్యాక్ సుధీర్ వర్మ రెండు సినిమాలు చేస్తాడా అని చిన్న సందేహం కూడా ఉంది. ఓబేబి సహనిర్మాత సునీత తాటి ఆ కొరియన్ సినిమాని నిర్మించనున్నారు. సురేష్ బాబు సమర్పకుడిగా కొనసాగనున్నారు.

 

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. అనూహ్యంగ, ఆసక్తికరంగా ఈ రీమేక్ ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చేయడమే గాక లేడీ ఓరియెంటెడ్ కి కథను షిఫ్ట్ చేసేశారని తెలుస్తోంది. మాతృకలో ఇద్దరు విలువల్లేని కర్కశమైన మగ పోలీసుల కథను చూపిస్తే.. తెలుగు రీమేక్ లో ఆ ఇద్దరూ ఆడ పోలీసులుగా మారారట. ఆ రెండు పాత్రలకు రెజీన- నివేద థామస్ లను ఎంపిక చేశారు. ఆ ఇద్దరికీ కథ.. పాత్రలు నచ్చాయి. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం. అయితే ఇలా కంప్లీట్ గా జెండర్ నే మార్చేసిన కథ ఎంతవరకు ఆకట్టుకుందో నని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: