బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని చాలాకాలం గాఢంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. నిజంగా వీళ్ళది సక్సస్ ఫుల్ లవ్ స్టోరీ. అయితే ఇలాంటి సక్సస్ ఫుల్ లవ్ స్టోరీస్ చాలా తక్కువని చెప్పాలి. చెప్పడమే ప్రత్యక్షంగా కూడా చాలా జంటలను చూస్తూనే ఉన్నాము. ఇక ఈమద్య కాలంలో ఒకజంట కు బ్రేకప్ చేసుకోవడానికి ప్రేమలో పడినంత కాలం పట్టడం లేదు. ప్రేమలో ఉన్నన్ని రోజులు పబ్ లు, పార్టీలు అంటూ తెగ తిరిగేసి సరదా తీరిపోయాక ఏదో ఒక చిన్న కారణం చూసుకొని బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇలాంటి బ్రేకప్ వార్తలు మనం ఎక్కువగా బాలీవుడ్ లో వింటూ ఉంటాం. బాలీవుడ్ సెలబ్రెటీలు ఎంతో మంది ప్రేమలో పడటం ఒకరి అవసరం ఒకరితో తీరిపోయాక బ్రేకప్ చెప్పుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ తో స్టార్ క్రికెటర్స్ లవ్ అఫైర్స్ గురించి కూడా మనం ఎప్పటి నుండో వార్తలు వింటూనే ఉన్నాం. 

 

ఎంతో మంది స్టార్ క్రికెటర్స్ హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కూడా యువ క్రికెటర్లు బాలీవుడ్ హాట్ బ్యూటీలతో ప్రేమలో మునిగి తేలుతున్నారు. యువ క్రికెటర్ పంథ్ ప్రస్తుతం ఇషా నెగీతో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌డైరెక్ట్ గా చెప్పాడు. గతంలో ఈయన ఊర్వశి రౌతెలాతో పార్టీలకు పబ్ లకు కలిసి తిరిగేవాడు. దాంతో ఇద్దరి మద్య ప్రేమాయణం నడుస్తుందని అంతా భావించారు. కాని అది కేవలం స్నేహం మాత్రమే అని.. పంథ్ ప్రస్తుతం ఇషాతో ప్రేమ లో ఉన్నట్లు గా ఆయన సన్నిహితులు చెబుతున్నారట.

 

ఇక ఇదే సమయంలో పంథ్.. ఊర్వశిల గురించి ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరు కూడా వాట్సప్ లో ఒకరిని ఒకరు బ్లాక్ చేసుకున్నారట. పంథ్ కు మళ్లీ దగ్గర అయ్యేందుకు ఊర్వశి ప్రయత్నిస్తుందని ఆ కారణంగానే పంథ్ ఆమె వాట్సప్ నెంబర్ ను బ్లాక్ చేశాడట. పంథ్ తన నెంబర్ బ్లాక్ చేశాడనే కోపంతో ఊర్వశి కూడా పంథ్ నెంబర్ ను బ్లాక్ చేసిందట.. అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి పంథ్ పూర్తిగా ఇషా నెగీతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. మరి ఇలా ఒక అమ్మాయి దొరకగానే ఇంకో అమ్మాయి నంబర్ బ్లాక్ చేయడం చూస్తుంటే పంథ్ యూజ్ అండ్ థో గా కనిపిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: