సంక్రాంతి విజేతలం మేమే.. అని చెప్పుకోవటానికి ఆ సీజన్ లో రిలీజయ్యే ఏ సినిమా యూనిట్ అయినా ఎదురుచూస్తుంది. ఈ సంక్రాంతికి ఆ గర్వం అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురం సినిమాకే దక్కిందని ట్రేడ్ వర్గాలు చెప్పేస్తున్నాయి. అభిమానులైతే సంబరాలు కూడా మొదలెట్టేశారు. డే వన్ నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న అల.. కు మరో ప్లస్ కూడా తోడవుతోంది.

 

 

క్లాస్ టచ్ తో ఫ్యామిలీ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా.. ఏ సెంటర్లలో మాత్రమే సక్సెస్ అవుతుందా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ బీ, సీ సెంటర్లలో కూడా రఫ్ఫాడించేస్తోంది. రెండో రోజు కూడా స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ సంక్రాంతి పుంజును నేనే అని సగర్వంగా చాటుతోంది. ఒకరోజు ముందు విడుదలైన మహేశ్ సరిలేరు.. నీకెవ్వరు సినిమా ఫుల్ మాస్ కంటెంట్ తో వచ్చింది. కొంత మిక్సిడ్ టాక్ తో రన్ అవుతూ టికెట్ విండో దగ్గర అల.. తో పోలిస్తే స్లో అయిపోయింది. పండుగ రోజులు ఇంకా ఉన్నాయి కాబట్టి కలెక్షన్లకు ఢోకా ఉండక పోయినా ఫుల్ పాజిటివ్ టాక్ తో ఉన్న అల.. వైకుంఠపురం ధియేటర్లు మాత్రం నిండిపోతున్నాయి. సరిలేరు.. మూడు రోజుల కలెక్షన్లను అల.. రెండు రోజుల్లోనే దాదాపు బీట్ చేసింది.

 

 

సరిలేరు.. తో పోలిస్తే.. అల.. కు ధియేటర్లు తక్కువే ఇచ్చారు. కానీ.. సినిమాకు వచ్చిన మంచి పాజిటివ్ టాక్ తో ఫుల్స్ పెరిగిపోతున్నాయి. బన్నీ స్టన్నింగ్ మాస్ యాక్టింగ్, త్రివిక్రమ్ మార్క్ కంటెంట్ తో బీ, సీ సెంటర్లలో కూడా దూసుకుపోతూ బన్నీకి మధుర జ్ఞాపకాన్ని ఇవ్వబోతోంది అల.. వైకుంఠపురంలో. ఇప్పటికే 2020 సంక్రాంతి విన్నర్ గా డిక్లేర్ అయపోయిన ఈ సినిమా మంచి రికార్డులు నెలకొల్పనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: