యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూలర్ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. బాలయ్య మూడు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా సికల్యాణ్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. అందువలన తనకు సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన బోయపాటితో ప్రస్తుతం సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు బాలయ్య, ఫిబ్రవరిలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 

 

బాలయ్య కోసం బోయపాటిసినిమా కథను ఎంతో పవర్ఫుల్ గా సిద్ధం చేసినట్లు సమాచారం. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమాకు మొదట సి రామ్ ప్రసాద్ ని కెమెరామ్యాన్ గా తీసుకున్నారు, అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆయన స్థానంలో మరొక కెమెరా మ్యాన్ ని తీసుకోవాలని భావిస్తోందట సినిమా యూనిట్. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా ఉండే విలన్ పాత్ర కోసం ఇప్పటికే పలువురు నటులను సంప్రదించిన బోయపాటి, ఫైనల్ గా సీనియర్ హీరో శ్రీకాంత్ ని ఇటీవల విలన్ గా ఫిక్స్ చేసినట్లు టాక్. గతంలో బాలయ్యతో తీసిన లెజెండ్ సినిమా కోసం ఫ్యామిలీ హీరో జగపతి బాబుని విలన్ ని చేసిన బోయపాటి

 

ఈ సినిమాతో మరొక ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ని విలన్ గా ఎంచుకోవడం సినిమాకు బాగా కలసివచ్చే అంశంగా భావిస్తోందట సినిమా యూనిట్. గతంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన యుద్ధం శరణం సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన శ్రీకాంత్, ఈ సినిమాతో తనను తాను అటువంటి పవర్ఫుల్ విలన్ పాత్రలో నిరూపించుకోవాలని చూస్తున్నారట. మరి జగపతి బాబు మాదిరిగా శ్రీకాంత్ ఎంతవరకు బాలయ్య సినిమా సక్సెస్ కు హెల్ప్ అవుతాడో చూడాలి. కాగా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని మే లో రిలీజ్ చేసే అవకాశం ఉందట.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: