అల్లు అర్జున్ నటించి అల.. వైకుంఠపురం సినిమా సెంటర్లతో సంబంధం లేకుండా స్టడీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతోంది. ఇప్పటికే సంక్రాంతి విన్నర్ గా డిక్లేర్ కూడా అయిపోయింది. సంబరాల్లో మునిగిపోతున్న మెగా అభిమానులకు, విజయానందంలో ఉన్న ఈ సినిమా యూనిట్ కు మరింత ఆనందం కలిగించే ప్రశంస దక్కింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్సినిమా సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు పూల బొకే పంపించారు. దీంతో సినిమా యూనిట్ ఆనందం రెట్టింపయింది.

 

 

‘అల.. వైకుంఠపురంలో సినిమా సాధించిన ఘన విజయానికి సంతోషిస్తున్నాను. హీరో అల్లు అర్జున్ గారికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ పవన్ తన సందేశాన్ని కూడా పంపించారు. దీంతో ఉప్పొంగిపోయిన అల్లు అర్జున్ ప్రతిగా పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘పవన్ కల్యాణ్ గారి నుంచి ఈ అభినందనలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటి మన:పూర్వక అభినందనలు నాకు అమితానందాన్ని కలిగించాయి. థాంక్స్ పవన్ కల్యాణ్ గారూ..’ అని బన్నీ తన ట్విట్టర్, ఇన్ స్టా అకౌంట్స్ లో రిప్లై ఇచ్చాడు.

 

 

మెగా, అల్లు హీరోల మధ్య విబేధాలున్నాయని జరుగుతున్న అసత్య ప్రచారానికి పవన్, బన్నీ చెప్పుకున్న అభినందనలు, కృతజ్ఞతలే సమాధానంగా నిలుస్తున్నాయి. బన్నీ కూడా తామంతా ఒకటేనని ఇటివలి ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేశాడు. అభిమానులు కూడా ఇటువంటి వార్ లు ఆపేయడం మంచిది. మొత్తానికి పవన్ అభినందనలు, బన్నీ కృతజ్ఞతతో మెగా అభిమానులు సంబరాల్లో చేసుకుంటారనడంలో సందేహం లేదు. సంక్రాంతికి రావాల్సిన నాలుగు సినిమాల్లో ఇప్పటికే మూడు సినిమాలు ధియేటర్లలోకి వచ్చేశాయి. ఇంకా కల్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: