కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్. ఈ సినిమాలో తారక్ నటన చాలా కొత్తగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికుడిగా తారక్ తనలోని కొత్త యాంగిల్ చూపించాడు. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. కొరటాల శివ మార్క్ స్పష్టంగా కనిపించేలా వచ్చిన ఈ సినిమాలో మెకానిక్ సత్యం రోల్ బాగా హిట్ అయ్యింది. ఆ పాత్రలో మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించడం జరిగింది. అయితే ఆ సినిమాలోని ఆ పాత్రకు బాలకృష్ణ అయితే బాగుండేది అని కొందరు అన్నారు.

 

ఇదే విషయాన్ని డైరక్టర్ కొరటాల శివ దగ్గర ప్రస్తావిస్తే.. నందమూరి బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ఒకే సినిమాలో చూడాలని తనకు కోరికగా ఉందని.. కాకపోతే అందుకు సరైన కథ ఇది కాదని.. వారిద్దరు ఉన్న సినిమాలో కథ లేకున్నా ఆడుతుందని.. కాని ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కాబట్టి బాలకృష్ణని సంప్రదించలేదని అన్నారు కొరటాల శివ. నందమూరి హీరోల మల్టీస్టారర్ సినిమాల గురించి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య ఒకటి రెండు కథలు కూడా విన్నారన్న వార్తలు వచ్చాయి. కాని మళ్లీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.

 

మొత్తానికి జనతా గ్యారేజ్ లో బాలయ్య పాత్ర అసాధ్యమే కాని ఈ న్యూస్ బయటకు రాగానే జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ పాత్రని బాలయ్య చేసి ఉంటే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నారు. అయితే బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ కలిసి సినిమా చేస్తే బాక్సులు బద్ధలయ్యే సినిమా కావాలి.. ఆ సినిమాలో కథ ఎలా ఉన్నా ఇద్దరి హీరోల హీరోయిజం పీక్స్ లో ఉండేలా ఉంటే చాలు.. ఆ సినిమాను హిట్ చేసే బాధ్యత నందమూరి ఫ్యాన్స్ మీద వేసుకుంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: