రికార్డులుకు దడలు పుట్టించే సినిమా రాబోతున్నది.  ఇప్పటి వరకు మల్టీస్టారర్ సినిమాలకు మాస్ కా బాప్ లాంటి సినిమా తెరకెక్కేందుకు సిద్ధం అవుతున్నది. టాలీవుడ్ మాస్ స్టార్ ఎవరు అంటే చెప్పేది మెగాస్టార్.  మెగాస్టార్ చేసిన మాస్ సినిమాలు మెగా రికార్డులు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.  ఇప్పుడు అదే ఊపులో తన 152 వ సినిమా చేస్తున్నారు.  కొరటాల శివ దర్శకత్వంలో ప్రతి భారతీయుడు తప్పకుండా దర్శించే దేవాలయాల చుట్టూనే కథను తిరుగుతుంది.  


దేవాలయాల పరిరక్షణను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఎట్టా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు.  దేవాలయాలకు సంబంధించిన సబ్జెట్ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.  సినిమా రికార్డుల కోసం ఎలా పరుగులు తీయాలో అలా పరుగులు తీసేందుకు మెగాస్టార్ సిద్ధం అవుతున్నాడు.  ఇప్పటి వరకు మెగాస్టార్, చరణ్ కలిసి మూడు సినిమాలు చేశారు.  మగధీరలో మెగాస్టార్ ఓ చిన్న స్టెప్స్ వేయగా, మెగాస్టార్ 150 సినిమాలో ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు చరణ్.  


దీనికంటే ముందు బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ సూపర్ ఎంట్రీ ఇచ్చి మెప్పించారు.  కాగా, అవి జస్ట్ ఒక నిమిషం సీన్స్ కంటే పెద్దగా ఉండవు.  కానీ, ఇప్పుడు మెగాస్టార్ హీరోగా చేస్తున్న 152 వ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు.  ఈ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.  ఈ మూవీ కోసం చరణ్ 15 రోజుల కాల్ షీట్ కూడా ఇచ్చారని సమాచారం.  15 రోజుల కాల్ షీట్ అంటే సీన్స్ ఎక్కువ ఉండొచ్చు.  మెగాస్టార్ తో కలిసి చేస్తున్న సినిమా, పైగా కొరటాల దర్శకత్వం కాబట్టి సినిమా తప్పనిసరిగా హిట్ అవుతుంది.  


అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  బొమ్మ హిట్టయితే రికార్డులు తిరగరాయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.  ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.  99 రోజుల్లోపుగా సినిమాను కంప్లీట్ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.  ఇందులో త్రిష హీరోయిన్ కాగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: