టాలీవుడ్ లో కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడకు జంప్ అయిన గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిందని చెప్పొచ్చు. దేవదాస్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడికి స్టార్ డం తెచ్చింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ పోకిరి సినిమానే. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన పోకిరి సినిమా అమ్మడికి రెండో సినిమా.. ఆ సినిమాతోనే ఇలియానా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. 

 

తెలుగు సినిమాలను నిర్లక్ష్యం చేసి బాలీవుడ్ బాట పట్టిన ఇలియానా అక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో వెనుకపడ్డది. ఇక రష్యన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణంలో మునిగిపోయిన ఇల్లి బేబ్ అతనితో చాలా దూరం వెళ్లినట్టు తెలిసిందే. వారానికో లిప్ లాక్ హాట్ స్టిల్స్ తో తన ఫ్యాన్స్ కు నిద్రపట్టకుండా చేసేది ఇలియానా. అయితే బాలీవుడ్ కెరియర్ కూడా అటకెక్కేయడంతో మళ్లీ తెలుగు సినిమాల మీద కన్నేసింది ఈ అమ్మడు. చాలా గ్యాప్ తర్వాత మాస్ మహరాజ్ రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

 

తెలుగులో ఎలాగైనా అవకాశాలు రాబట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది అమ్మడు. ఇక ఈ క్రమంలో తనకు తొలిముద్దు అనుభవం ఒక తెలుగు హీరో వల్లే కలిగిందని చెప్పింది. దేవదాస్ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రాం తో జతకట్టిన ఇలియానా ఆ సినిమాలో అతనితో ఓ లిప్ లాక్ చేసింది. అదే తనకు తొలిముద్దు అని.. రాం తో ఆ సీన్ చాలా ఎంజాయ్ చేశానని అంటుంది ఇలియానా. మొత్తానికి రాం తో తన లిప్ లాక్ గురించి స్పెషల్ గా చెబుతున్న ఇలియానా కనీసం తన మొదటి సినిమా హీరో అయినా మళ్లీ అవకాశం ఇస్తాడని అనుకుంటుందో ఏమో అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: