రాజమౌళి తరువాత భారీ సినిమాలు తీస్తూ వరస విజయాలు సాధిస్తున్న ట్రాక్ రికార్డ్ కొరటాల శివకు కొనసాగుతోంది. ప్రస్తుతం చిరంజీవితో కొరటాల తీస్తున్న మూవీ కూడ ఊహించిన విజయాన్ని అందుకుంటే కొరటాల రాజమౌళితో పోటీ పడే స్థాయికి చేరిపోతాడు. 

ఇలాంటి పరిస్థితులలో రామ్ చరణ్ విషయమై కొరటాల రాజమౌళీల మధ్య ఒక జెంటిల్ మెన్ అగ్రిమెంట్ కుదిరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల చిరంజీవితో తీస్తున్న మూవీలో ఒక కీలక పాత్ర చేస్తున్న నేపధ్యంలో చరణ్ ను 40 రోజుల కాల్ షీట్స్ ఇవ్వవలసిందిగా కొరటాల కోరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చరణ్ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ లో చిక్కుకున్న నేపధ్యంలో తన డేట్స్ కొరటాలకు ఎప్పుడు ఇవ్వగలడో అతడికే తెలియని పరిస్థితులలో చరణ్ కల్పించుకుని ఈమధ్య కొరటాల రాజమౌళి ల మధ్య ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల అభ్యర్ధనను విన్న రాజమౌళి తన మూవీకి సంబంధించి చరణ్ తో తీయవలసిన సీన్స్ షూటింగ్ ఏప్రియల్ కు అయిపోతుంది కాబట్టి ఆ తరువాత చరణ్ తో తీయవలసిన సీన్స్ షూటింగ్ ను పెట్టుకోవలసిందిగా రాజమౌళి కొరటాలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో చిరంజీవి కొరటాల మూవీ ఈ సమ్మర్ లో విడుదల కావడం అసాధ్యమని అన్నీ కుదిరితే ఈ ఏడాది దసరాకు లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల ఉంటుంది అని అంటున్నారు. 

ఈ సినిమాకు సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటపడింది. ‘సైరా’ కు వేసిన భారీ సెట్స్ ను మార్చివేసి చిరంజీవి కొరటాల మూవీకి పనికివచ్చే విధంగా ఇప్పుడు ఈ మూవీ సెట్స్ రీ డిజైనింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి తన లేటెస్ట్ మూవీని సాధ్యమైనంత తక్కువ పెట్టుబడితో తీయమని కొరటాల పై ఒత్తిడి చేస్తున్న నేపధ్యంలో ఈ మూవీలో నటించే కీలక నటీనటుల పారితోషికాల విషయంలో కూడ కొరటాల చాల పొదుపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది..     

 

మరింత సమాచారం తెలుసుకోండి: