అన్ని మనం అనుకున్నట్టుగా జరుగుతాయని అనుకోలేము.  ఒక్కోసారి జరగొచ్చు. జరగకపోవచ్చు.  ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము.  జరగకపోయినా అంతా మన మంచికే అని సరిపెట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది.  13 ఏళ్ల క్రిందట ముఖానికి రంగువేసుకోవడాన్ని పక్కనపెట్టిన రాములమ్మ విజయశాంతి,ఇన్నేళ్ల విరామం తరువాత మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమా చేసింది.  


ఈ సినిమాలో ప్రొఫెసర్ భారతి గెటప్ వేసింది.  ఈ పాత్రలో ఆమె నటన మెచ్చుకోదగ్గది.  13 ఏళ్ల గ్యాప్ తీసుకున్నా, తిరిగి కెమెరా ముందుకు వెళ్ళగానే హ్యాపీగా సాగిపోయింది.  ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నటించి మెప్పించింది.  సినిమా రంగంలో అందరికి ఒకేలాంటి అవకాశాలు దొరకవు.  దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అంతే.

 

 సినిమా రంగంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే విజయశాంతి ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళింది.  
రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక, అక్కడ బాధక సాధకాలు అక్కడా ఉంటాయి.  ఎక్కడ ఉండే ఇబ్బందులు అక్కడే ఉంటాయి.  కానీ, రాజకీయాల్లో ఉండే ఒత్తిడుల కారణంగా బిపిలు వస్తుంటాయాని విజయశాంతి చెప్పడం విశేషం.  ప్రజా సమస్యలు పరిష్కరించే సమయంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని, వాటిని పరిష్కరిస్తూ ప్రజల మధ్యన ఉండటం చాలా బాగుంటుందని చెప్పింది.  అయితే, సినిమా రంగంలో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుందని, మనపని మనం చేసుకుంటూ జనాలను ఎంటర్టైన్ చేస్తే చాలు అన్నది.  

 


రాజకీయాల్లో ఉన్న టెన్సన్స్ ను సినిమా రంగంలోకి తిరిగి అడుగుపెట్టగానే మటుమాయం అయ్యాయని, తిరిగి రాజకీయాల్లో ఉత్సాహంగా పనిచేస్తానని చెప్పింది రాములమ్మ.  ఈ సినిమాలో హుందాగా ఉండే పాత్రలో నటించి మెప్పించినట్టు విజయశాంతి పేర్కొన్నది.  తనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ బాధలను మనసులోనే ఉంచుకొని వాటిపై పోరాటం చేసే మహిళ పాత్రలో నటించినట్టు విజయశాంతి తెలిపారు.  ప్రతిఘటన, కర్తవ్యం వంటి పాత్రలు వస్తే చేస్తానని, అలాంటి పాత్రలు సంవత్సరానికి ఒక్కటి వచ్చినా మేలు అని చెప్పింది విజయశాంతి.  

మరింత సమాచారం తెలుసుకోండి: