మొదట్లో ఆమెని ఐరన్ లెగ్ అన్నారు.. అందం అభినయం ఉన్నా మొదటి రెండు సినిమాల్లో ఆ హీరోయిన్ ను పెద్దగా వాడుకోలేదు. యువ హీరోలతో చేసిన ఆ అమ్మడి మీద స్టార్ హీరోల కన్నౌ పడ్డది. అంతే ఒక్కసారిగా ఆ హీరోయిన్ ఫేట్ మారిపోయింది. ఇంతకీ ఇక్కడ ప్రస్తావిస్తున్న హీరోయిన్ పేరు ఎవరిదో తెలుసా.. మీకు అర్ధమయ్యి ఉండొచ్చు.. అదేనండి వరుసగా స్టార్స్ తో జోడీ కడుతూ సూపర్ హిట్లు అందుకున్న హాట్ బ్యూటీ పూజా హెగ్దె. ఒంటి మీద కేజీ కండ ఉన్నట్టు కనిపించకపోయినా ప్రేక్షకుల మనసులు గెలిచే అందం అభినయం ఆమె సొంతం.

 

లేటెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్దె కుమ్మేసిందని చెప్పొచ్చు. థైస్ చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టిన ఈ అమ్మడు సినిమాలో చాలా అందంగా కనిపించింది. అందులో సినిమాలో బుట్టబొమ్మ సాంగ్ కూడా పెట్టారు.. ఆ పాట కచ్చితంగా పూజా హెగ్దె కోసమే అన్నట్టుగా ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక హీరోయిన్ తొడల అందాలకి పడిపోయిన బంటు అదేనండి మన హీరో అల్లు అర్జున్ మాటిమాటికి మేడం సర్.. మేడం అంతే అంటారు.

 

బన్ని మాత్రమే కాదు సినిమా చూసిన ఆడియెన్స్ కూడా పూజా హెగ్దె సర్.. పూజా హెగ్దే.. అనేలా ఆమె సర్ ప్రైజ్ చేసింది. తన పాత్రకు తగినట్టుగా సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వస్తున్న పూజా హెగ్దె అల వైకుంఠపురములో హిట్ లో తను కూడా ఒక కారణమయ్యేలా చేసుకుంది. బన్నితో డిజేతో హిట్ అందుకున్న అమ్మడు అతనితో రెండోసారి చేసిన ఈ సినిమాతో కూడ సూపర్ హిట్ కొట్టింది. ఈ ఇద్దరి జోడీ కూడా సూపర్ హిట్ పెయిర్ అనేస్తున్నారు ఆడియెన్స్. నిన్న జరిగిన అల వైకుంఠపురములో థ్యాంక్స్ మీట్ లో బన్ని కూడా పూజా హేగ్దేతో మరిన్ని సినిమాలు చేస్తానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: