నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎప్ప‌టి నుంచో సంక్రాంతికి రావాల‌నుకున్నా ఈ సారి కుదిరింది.  `ఎంత‌మంచివాడ‌వురా` అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, మెహ్రీన్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం స‌తీశ్ వేగ్నేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్  చిత్రం ఉండ‌బోతుంది. ఈ చిత్రం పండుగ రోజున అంటే సంక్రాంతిరోజున 15వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ట్రైలర్‌లకు మంచి టాక్ రావడంతో సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే  నెల‌కొన్నాయి.

 


అయితే ఈ సినిమా రిలీజ్‌కి రెండు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్రబృందం జోరును పెంచింది. అందులో భాగంగానే హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... అస‌లు ఈ సినిమాకి ముందు ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్‌ను అనుకున్నారని అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైన్ సినిమా కావడంతో కాస్త తెలుగుదనంతో ఉన్న‌ టైటిల్ అయితే బావుంటుంద‌ని భావించిన‌ట్లు చివరకు `ఎంత మంచివాడవురా` అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిపారు.

 

క‌థ‌ను బ‌ట్టే టైటిల్‌ను పెట్టాం. పాజిటివ్‌నెస్‌ను మంచిత‌నం అంటాం. హీరో త‌ను చుట్టూ జ‌రిగే ప‌రిస్థితుల‌ను చెడుగా తీసుకోడు. హీరో జీవితంలో జ‌రిగే ఓ సందర్భంలో పాజిటివ్‌నెస్‌ను చూసుకున్న హీరో.. అలాగే పెరుగుతాడు. జీవితంలో ఇత‌రుల‌కు ఇవ్వ‌డం అనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించాం.  మ‌నుషులంతా మంచోళ్లే.. ప్ర‌తి ఒక్క‌రూ వారి సైడ్ నుండి మంచివాళ్లే. కాక‌పోతే కొంద‌రు చేసే ప‌నుల వ‌ల్ల మ‌నం హ‌ర్ట్ అవుతాం. వారిని బ్యాడ్ అంటాం. మ‌నుషులంద‌రూ మంచోళ్లే.. అయితే వారు చేసే త‌ప్పును మ‌నం వాళ్ల‌కి చెప్పాలనేదే మా సినిమా కాన్సెప్ట్ అన్నారు. శ‌త‌మానం భ‌వ‌తి అనేది ఓ ఇంట్లోని ఇద్ద‌రు పెద్ద వ్య‌క్తుల‌కు సంబంధించిన క‌థ అయితే.. శ్రీనివాస క‌ల్యాణం సినిమా పెళ్లికి సంబంధించింది. కానీ ఎంత మంచివాడ‌వురా వేర్వేరు మ‌న‌స్తత్వాలు, ఆలోచ‌న‌లు ఉన్న వ్య‌క్తుల జీవితాల్లోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చి మార్చాడు? అనేదే సినిమా. క‌చ్చితంగా ఓ వ్య‌క్తిలో నెగిటివిటీ ఉంటుంది. దాన్ని హీరో ఎలా క‌ట్ చేశాడ‌నేదే సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: