సంక్రాంతి పండుగ అంటే సిరుల పండుగ.. పంట ఇంటికొచ్చి రైతు కళ్లలో ఆనందాలు విరజిల్లే పండుగ. అలాంటి సంక్రాంతి పండుగని తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ప్రజలే కాదు సినిమా వాళ్లు కూడా సంక్రాంతి పండుగ చాలా గొప్పగా జరుపుకుంటారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పుట్టిన సినిమా హీరోలు దర్శకులు అక్కడ జరిగే కోడి పందేళ్లో పాల్గొంటారు.

 

సినిమా వాళ్లు ప్రతి సంవత్సరం తమ సొంత జిల్లాలోని సొంత ప్రాంతాలకు వెళ్లి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గోదావరి జిల్లాలకు చెందిన సినిమా హీరోలు, క్యారక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు సంక్రాంతి సందర్భంగా సొంత జిల్లాలకు వచ్చి అక్కడ సంబరాలు చేస్కుంటున్నారు. భీమవరంలో జరిగే కోడి పందాలకు హాజరవుతున్నారు.  

 

ప్రకాశం జిల్లాకు చెందిన హీరో గోపిచంద్ తో పాటు అదే జిల్లాకు చెందిన సినిమా ఇండస్ట్రీకి చెందినవారంతా ఆ జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్న సిని సెలబ్రిటీస్ కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. సక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లని వారు కూడా ఉంటున్న దగ్గరే సంబరాలు జరుపుకుంటారు. అయితే సంక్రాంతి వచ్చింది అంటే ఆంధ్రాలో కోడి పందాలు అదిరిపోతాయి. సినిమా వాళ్లకు ఈ కోడి పందాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే వారు కూడా తమ ఊళ్లకు చేరుకుని అక్కడ జరిగే కోడి పందాలను వీక్షిస్తారు.  

 

సినిమా వాళ్లంతా ఈ సంక్రాంతికి సొంత ఊళ్లకు చేరుకుని అక్కడ చిన్ననాటి స్నేహితులతో.. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. పండుగ రోజు సొంత జిల్లాలకు సినిమా సెలబ్రిటీస్ వెళ్లి చేసే హంగామా పండుగకు మరింత అందాన్ని తెస్తుందని చెప్పొచ్చు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతికి మాత్రం సొంత జిల్లాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. తెలుగు సినిమాల్లో సంక్రాంతి కూడా ఒక భాగమని చెప్పొచ్చు. సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవడమే కాకుండా సాధ్యమైనంత వరకు సినిమాలో అవకాశం ఉంటే సంక్రాంతి విశిష్టత గురించి కూడా చూపిస్తుంటారు సినిమా దర్శకులు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: