ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన రాక్ ఫెల్లర్ తన 86వ పుట్టినరోజునాడు తన డైరీలో ఇలా రాసుకున్నాడు. చేసే పనిని ఆడే ఆట ని ఆహ్లాదకర సెలవు దినాన్ని ఒకటిగా చూసే శక్తి తనకు ఇమ్మని భగవంతుడుని కోరుకుంటూ అలా తాను జీవించలేని మరుక్షణం తనను భగవంతుడు తన దగ్గరకు తీసుకు వెళ్ళి పోవచ్చు అంటూ భావయుక్తంగా తన డైరీలో రాసుకున్నాడు. అంతేకాదు లేని దాని గురించి భాధపడే వ్యక్తి ఎదగడని ఉన్నదాన్ని పెంచుకునే వ్యక్తి మాత్రమే జీవితంలో విజయం సాధించి ఐశ్వర్య వంతుడు అవుతాడు అంటూ రాక్ ఫెల్లర్ తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు.  


జీవితం అంటే మార్పు అభివృద్ధి అందులో భాగం. చాల మందికి కారు బంగ్లా కొనుక్కోవాలని అన్ని సుఖాలు అనుభవించాలని ఆశ ఉంటుంది. అయితే ఆ మార్పు కోసం ఆశించిన అభివృద్ధి అందుకోవడం కోసం కష్టపడే వారు చాల తక్కువగా ఉంటారు. ప్రతి మనిషీ తన శ్రమతో డబ్బు సంపాదించి దాన్ని కొంతకాలం తన అదుపులో పెట్టుకుని ఆ తర్వాత ఇతరులతో పంచుకోవడం కూడా అత్యంత సహజమైన ప్రక్రియ. ఇది సాదించటానికి ముందుగా మనం మన వృత్తిలో ఎదగాలి. మనం రోజు చేసే పనిలో ప్రత్యేకతని సాదించడం ద్వార డబ్బుని ఎక్కువగా సంపాదించగలుగుతాము. 

అవసరాలు తీర్చగల శక్తి మాత్రమే కాకుండా ఎదుటివారి ప్రేమను పొందడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఈ రోజుల్లో డబ్బు చాలా అవసరము అని మనం గుర్తించాలి. డబ్బు ఒక శక్తివంతమైన ఆయుధం దానిని సరిగ్గా వాడటం తెలియకుంటే మనకే ప్రమాదం. ఆ సంపాదించిన డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నాము అనే విషయం పై వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి ఇలా ఎదగాలి అంటే అతడికి అన్ని విషయాలలోనూ పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. అలా ఆలోచించే వారి దగ్గరే గెలుపు దరి చేరుతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: