టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో మొదటగా వచ్చే పేరు ప్రభాస్.. అయితే ప్రభాస్ రేంజ్ వేరు.. ప్రభాస్ పెళ్ళి గురించి రోజుకో కథనం వస్తూంటుంది. ప్రభాస్ కూడా తన పెళ్ళి గురించి చెపుతూనే ఉన్నాడు. అయితే మిడ్ రేంజ్ హీరోలలో పెళ్ళి ప్రస్తావన తీసుకురాని హీరో నితిన్.. నితిన్ ఇండస్ట్రీకి పరిచయమై చాలా రోజులు అవుతోంది. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఒక దశలో నితిన్ పని అయిపోయిందనుకున్నారు.

 

కానీ మళ్ళీ ఇష్క్ సినిమా ద్వారా బ్యాక్ అయ్యాడు. ఇక అప్పటి నుండి మళ్ళీ వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. ప్రస్తుతం నితిన్ నాలుగు చిత్రాలకి సైన్ చేశాడు. వాటిల్లో మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఒక సినిమా రిలిజ్ కి రెడీ అవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఆద్యంతం నవ్వులు తెప్పించేదిగా ఉంది.

 

అయితే ప్రస్తుతం నితిన్ పెళ్ళి ఏర్పాట్లు మొదలవుతున్నాయట. ఇటు సినిమాల్లో బిజీగా ఉన్న నితిన్ ఇంట మరి కొద్ది రోజుల్లో పెళ్ళి బాజాలు మోగనున్నట్లు సమాచారం. యూఎస్ కి చెందిన ఎం బి ఏ గ్రాడ్యుయేట్ అయిన శాలినిని పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది. గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకోనున్నారని సమాచారం. ఐతే నితిన్ పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైపోయాయని తెలుస్తున్న తాజా వార్త.

 

నితిన్ నాన్నగారైన సుధాకర్ రెడ్డి దుబాయ్ లో ఓ ప్రముఖ హోటల్ కూడా బుక్ చేశారట. దుబాయ్ లో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏప్రిల్ లో ఈ వివాహం జరగనుందని సమాచారం. మరి ఈ విషయమై నితిన్ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. భీష్మ సినిమా ఫిబ్రవరి ౨౧ వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: