సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్.  ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తుండడం తో ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోయాయి ప్రేక్షకుల్లో. ఇక ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రజిని ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే మురుగదాస్ రజినీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ బంపర్ విక్టరీ సాధించడంతో ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని  ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. 

 

 

 ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరుస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తమిళంలో పాటు తెలుగులో కూడా భారీ వసూళ్ళ పరంపర కొనసాగిస్తుంది రజిని దర్బార్ సినిమా. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి లీకుల బాధ ఉన్నప్పటికీ కూడా వసూళ్ళ పరంగా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు దర్బార్. ఏకంగా నాలుగు రోజుల్లోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు 7.57 కోట్లు వసూళ్లు రాబట్టింది.ఒక్క నైజాం ప్రాంతం లోనే ఈ సినిమా 3.78 కోట్లు వసూళ్లు రావడం గమనార్హం. 

 

 

 ఇక తమిళ నాట మూడవరోజు ఏకంగా 30 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఒక్క తమిళనాడులోనే రజనీ హీరోగా నటించిన ధర్భర్ సినిమా నాలుగు రోజుల్లోనే 100 కోట్లు క్లబ్లో చేరి పోయింది. నాలుగు రోజుల్లోనే లాభాల బాటపట్టింది రజిని దర్బార్ సినిమా. ఈ సినిమాలో అన్నీ అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు మురుగదాస్. ఒక సాధారణమైన కథని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకర్శించారు  మురుగదాస్. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ స్టైల్ కి రజనీ డాన్స్ రజిని డైలాగ్ లు అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు మరిన్ని వసుళ్ళు  పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: