ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా బయోపిక్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. సినీ రాజకీయ ప్రముఖుల బయోపిక్ లను తెరకెక్కించి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో బయోపిక్ లో హవా నడుస్తోంది. ఇప్పటికే రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు క్రికెట్ ప్రముఖుల బయోపిక్లు కూడా కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. కొన్ని సినిమాలు ఆల్రెడీ విడుదల అయ్యాయి కూడా. అయితే కథ విషయంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోవడం... నిజ జీవిత కథకు కొన్ని సినిమాటిక్ హంగులు అద్దితే  సరిపోతుండటం.. అంతేకాకుండా బయోపిక్ లకు ఎక్కువగా ప్రేక్షకులు ఆకర్షితులై భారీ విజయాలను కట్ట  పెడుతుండటంతో దర్శక నిర్మాతలందరూ బయోపిక్ ల  పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 

 

 

 ప్రస్తుతం దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ సంబంధించి రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. ఓ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా మరో సినిమాలో  రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తున్నారు. ఇక సంగీత రంగంలో ఎంతో కీర్తి సాధించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. ఇళయరాజా పాటలు ఇప్పటికీ నాటి తరం నుండి  నేటి తరం వరకు అందరినీ ఆకర్షిస్తూ నే ఉన్నాయి. ఇళయరాజా పాటలు వినడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇళయరాజా బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఇళయరాజా బయోపిక్ ను ఆయన కొడుకు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు  సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయనే ఒక భేటీలో స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. 

 

 

తన తండ్రి ఇళయరాజా బయోపిక్ ను  తెరకెక్కించాలని ఆలోచన తనకు ఉందని ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. దీనికి రాజా ది జర్నీ అనే టైటిల్ బాగుంటుందని ఓ  సమయంలో తెలిపారు యువన్ శంకర్ రాజా. అయితే ఇళయరాజా బయోపిక్ లో తన తండ్రి పాత్రను పోషించడానికి తమిళ నటుడు ధనుష్ అయితే సరిగ్గా సెట్ అవుతారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వార్త ఊపందుకున్నది. అయితే ఇళయరాజా పాత్రలో నటించడానికి ధనుష్  అంగీకరిస్తారా  అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సంగీత జ్ఞాని... స్వరాల మాంత్రికుడు... ఎన్నో జాతీయ రాష్ట్ర అవార్డులు సైతం అందుకొని సంగీత రంగంలో రారాజుగా రాణిస్తున్న ఇళయరాజా బయోపిక్ సినిమా త్వరలో తెరకెక్కబోతునట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: